అఖిల్ క‌ళ్ల ముందు సెక్సీ టార్గెట్.. 

20 ఓవ‌ర్లు 200 కొట్టాలంటే క‌ష్ట‌ప‌డాలి.. తెగిస్తే ఏదైనా జ‌ర‌గొచ్చు. అదే 20 ఓవ‌ర్ల‌లో 120 ప‌రుగులే చేయాలంటే ఏదో తెలియ‌ని అల‌స‌త్వం వ‌స్తుంది. ఆ ఏముందిలే బాల్ కో ర‌న్ కొట్టేద్దాం అనుకుంటాం. కానీ అక్క‌డే తేడా జ‌రిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. సినిమాల్లో కూడా అంతే. పెద్ద ల‌క్ష్యం ఉన్నపుడు కొన్నిసార్లు తెలియ‌కుండా వ‌ర్క‌వుట్ అయిపోతుంటాయి. బాహుబ‌లి మాదిరి. కానీ చిన్న ల‌క్ష్యాలే కంగారు పెడుతుంటాయి. చాలా సినిమాలు చిన్న చిన్న టార్గెట్స్ అందుకోలేక బోల్తా కొడుతుంటాయి. ఇక ఇప్పుడు అఖిల్ ముందు కూడా ఇలాంటి ఊరించే టార్గెట్ ఫిక్స్ చేసాడు నాగార్జున‌. ఈయ‌న న‌టించిన హ‌లో సినిమా బిజినెస్ 32 కోట్ల‌కు జ‌రిగింది. తొలి సినిమా కంటే ప‌ది కోట్లు త‌క్కువే ల‌క్ష్యాన్ని నిర్ధేశించాడు నాగార్జున‌. హ‌లో సినిమా హిట్ అనిపించుకోవాలంటే 32 కోట్లు దాటి రావాలి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని 26.5 కోట్ల‌కు అమ్మారు. ఇక ఓవ‌ర్సీస్ లో విక్ర‌మ్ కే కుమార్ ఎఫెక్ట్ తో 3 కోట్ల‌కు వెళ్లింది సినిమా. దానికితోడు క‌ర్ణాట‌క‌లో 2 కోట్లు.. ఇలా వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ చిత్ర థియెట్రిక‌ల్ బిజినెస్ 32 కోట్లు అయింది. అంటే ఈ చిత్రం హిట్ అనిపించుకోవాలంటే 35 కోట్ల మార్క్ అందుకుంటే చాలు. అఖిల్ సినిమాను 42 కోట్ల‌కు అమ్మారు. అది డిజాస్ట‌ర్. అయితే ఇప్పుడు ఆ లెక్క ప‌ది కోట్ల‌కు దించేసారు. ఈ సారి 32 వ‌స్తే చాలు. హ‌లో సినిమా హిట్టైతే పెద్ద టార్గెట్ ఏం కాదిది. ఈజీగా 32 కోట్లు అందుకుంటాడు అఖిల్. కానీ ఏదైనా తేడా వ‌స్తే మాత్రం వెన‌కాలే నాని ఉన్నాడు. మిడిల్ క్లాస్ అబ్బాయి అంటూ అంద‌ర్నీ మాయ చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. మ‌రి నానిని త‌ట్టుకుని త‌న 32 కోట్లు అఖిల్ వెన‌క్కి తెచ్చుకుంటాడా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here