అఖిల్ టైటిల్ ప‌ట్టేసిన రామ్.. 

అవును.. ఇప్పుడు నిజంగానే అఖిల్ టైటిల్ ను రామ్ తీసుకున్నాడు. రామ్ హీరోగా కొత్త సినిమా ఓపెన్ అయింది. హ‌లో గురు ప్రేమ‌కోస‌మే అంటు న్నాడు ఈ హీరో ఇప్పుడు. త్రినాథ‌రావ్ న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఎప్పుడో క‌మిటైన సినిమా ఇప్పుడు ముహూర్తం జ‌రుపుకుంది. అన్నీ కుదిరుంటే హ‌లో సినిమాకే హ‌లో గురు ప్రేమ‌కోస‌మే అనే టైటిల్ పెట్టేవాళ్లు. కానీ ఎందుకో తెలియ‌దు కానీ గురు ప్రేమ‌కోస‌మే తీసేసి.. కేవ‌లం హ‌లో మాత్ర‌మే వాడేసుకున్నాడు నాగార్జున‌. ఇప్పుడు మిగిలింది రామ్ వాడుతున్నాడు. గతేడాది ఫిక్సైన ఈ కాంబో ఇప్పుడు ప‌ట్టాలెక్కింది. నేనులోక‌ల్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత త్రినాథ‌రావ్ చేస్తోన్న సినిమా ఇది. ఈయ‌న‌కు మామఅల్లుళ్ల సెంటిమెంట్ ఉంది. సినిమా చూపిస్త మావా.. నేనులోక‌ల్ రెండూ మామాఅల్లుళ్ల చుట్టూనే తిరుగుతుంటాయి.
త్రినాథ‌రావ్ కు తోడుగా ర‌చ‌యిత కూడా తోడుగా ఉన్నాడు. అత‌డి పేరు ప్ర‌స‌న్న కుమార్. వీళ్లిద్ద‌రూ క‌లిసి మామా అల్లుళ్ల క‌థ‌లు రాయ‌డంలో ఎక్స్ ప‌ర్ట్ అయిపోయారు. ఇప్పుడు కూడా మ‌రోసారి ఇలాంటి త‌ర‌హా క‌థ‌నే సిద్ధం చేస్తున్నారు. ద‌ర్శ‌కుడికి, ర‌చ‌యిత‌కు ఎంత మంచి అనుబంధం ఉంటే క‌థ‌లు కూడా అంతే బాగా వ‌స్తాయి. ఈ ఇద్ద‌రూ సినిమా చూపిస్త మావాతో మాయ చేసారు. నేను లోక‌ల్ తో అదే మాయ చేసారు. ఇడియ‌ట్ నే కాస్త అటు తిప్పి ఇటు తిప్పి మ‌ళ్లీ తీసింది ఈ జోడీ. నాని ఇమేజ్ ప్ల‌స్ న‌ట‌న‌తో ఈ సినిమా కూడా ప్రేక్ష‌కుల‌కు బాగా ఎక్కేసింది. ముఖ్యంగా ప్ర‌సన్న పెన్ ప‌వ‌ర్ ఈ సినిమాకు హెల్ప్ అయింది. డైన‌మైట్ లా పేలే డైలాగుల‌తో ర‌చ్చ చేసాడు ప్ర‌స‌న్న‌. ఇప్పుడు రామ్ తోనూ ఇలాంటి మ్యాజిక్ చేయ‌బోతు న్నారు ఈ జోడీ. దీనికి హ‌లో గురు ప్రేమ‌కోస‌మే అనే టైటిల్ పెట్టిన‌పుడే సినిమా ఎలా ఉండ‌బోతుందో క్లారిటీ వ‌చ్చేస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఇదే ఏడాది సెప్టెంబ‌ర్ లో విడుద‌ల కానుంది. ఇందులో మ‌రోసారి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ తో జోడీ క‌డుతున్నాడు రామ్. ఉన్న‌ది ఒక‌టే జింద‌గీలో ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here