అఖిల్ పెళ్లి అదిరింది..

అదేంటి.. అఖిల్ కు పెళ్లి ఎప్పుడు అయింది..? అస‌లు నిశ్చితార్థంతోనే క‌దా ఆగిపోయింది అనుకుంటున్నారా..? అవును.. అది నిజ‌మే కానీ పెళ్లి కూడా అదిరింది అనేది కూడా నిజ‌మే. అయితే అదిరింది నిజం పెళ్లి కాదు.. సినిమాలో పెళ్లి. ఈయ‌న ప్ర‌స్తుతం హ‌లో సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్త‌యింది. విక్ర‌మ్ కే కుమార్ ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. డిసెంబ‌ర్ 22న హ‌లో విడుదల కానుంది. అందుకే ప్ర‌మోష‌న్ లో వేగం పెంచేసాడు నిర్మాత నాగార్జున‌. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పాట ఒక‌టి విడుద‌ల అయింది. అందులో అఖిల్ డాన్స్ మూవ్స్ మ‌రోసారి అభిమానుల‌ను అల‌రించాయి. ఇక పెళ్లి పాట చాలా రిచ్ గా చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు. పిఎస్ వినోద్ సినిమాటోగ్ర‌ఫీ అదిరిపోయింది. కొత్త ముద్దుగుమ్మ క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ చాలా అందంగా ఉంది. ర‌మ్య‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబు లాంటి స్టార్ క్యాస్ట్ తో పాట నిండుగా మారిపోయింది. మొన్న విడుద‌లైన ట్రైల‌ర్.. ఇప్పుడు రిలీజైన పాట.. హ‌లోపై ఆస‌క్తితో పాటు అంచ‌నాలు కూడా పెంచేస్తుంది. అఖిల్ తో అంచ‌నాలు అందుకోలేక‌పోయిన అఖిల్.. హ‌లోతో క‌చ్చితంగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాయ చేయాల‌ని చూస్తున్నాడు. మ‌రి అక్కినేని వార‌సుడి ఆశ‌లు ఎంత‌వ‌ర‌కు హ‌లో తీరుస్తుందో చూడాలిక‌..!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here