అఖిల్ మూడో సినిమా ఆయ‌న‌తోనా..?

Akhil Akkineni third movie

ఇప్పుడే హ‌లో సినిమాతో మంచి క్లాస్ సినిమా చేసి.. విజ‌యానికి అడుగు దూరంలో ఉన్నాడు అఖిల్. తొలి సినిమా ప‌క్కా మాస్ సినిమా చేసి చేతులు కాల్చుకున్న అఖిల్ కు రెండో సినిమా తాను చేసిన త‌ప్పేంటో చూపించింది. కుటుంబ నియ‌మాలు పాటించి ఎం చ‌క్కా క్లాస్ సినిమాలు చేసుకుంటే హిట్లు వ‌స్తాయ‌ని హ‌లో చూపించింది. కానీ ఇప్పటికీ అఖిల్ మ‌న‌సు మాత్రం మాస్ సినిమాల వైపే వెళ్తుంద‌ని తెలుస్తుంది. అస‌లు అక్కినేని ఫ్యామిలీ అంటే క్లాస్ సినిమాలు.. ప్రేమ‌క‌థ‌లు.. కానీ అఖిల్ మాత్రం దీన్ని వినిపించుకోవడం లేదు. అచ్చంగా మాస్ మాస్ అంటూ క‌ల‌వ‌రిస్తున్నాడు. హ‌లోలో కూడా యాక్ష‌న్ యాక్ష‌న్ స్టంట్స్ అదిరిపోయాయి. మాస్ ఫాలోయింగ్ కోస‌మే అఖిల్ ప్ర‌య‌త్నాల‌న్నీ జ‌రుగుతున్నాయి. ఇక నాగార్జున కూడా కొడుకు కోరిక కాద‌న‌లేక‌పోతున్నాడు. మూడో సినిమా కోసం ఏకంగా ఇద్ద‌రు మాస్ డైరెక్ట‌ర్ల‌ను మాట్లాడుతున్నాడు నాగార్జున‌. అందులో ఒక‌రు బోయ‌పాటి శీను. హీరోల‌కు మాస్ ఇమేజ్ తీసుకురావ‌డంలో ముందుండే ఈ త‌రం ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శీను. అందుకే అఖిల్ ను ఆయన చేతుల్లో పెడుతున్నార‌నే టాక్ కూడా వినిపిస్తుంది. నాగార్జున ఇచ్చిన ఆఫ‌ర్ కు బోయ‌పాటి కూడా ఓకే అన్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ‌ కోసం క‌థ సిద్ధం చేస్తున్న బోయ‌పాటి.. ఆ త‌ర్వాత అఖిల్ ను లైన్ లో పెడ‌తాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక ఈయ‌న‌తో పాటు కొర‌టాల శివ‌తోనూ నాగ్ మంత‌నాలు జరుపు తున్నాడు. మ‌రి బోయ‌పాటి.. కొర‌టాల‌లో అఖిల్ మూడో సినిమా కోసం ఎవ‌రు లైన్ లోకి వ‌స్తారో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here