అజ్ఞాత‌వాసి.. కోటి వైపు ప‌రుగులు.. 

Agnyaathavaasi
నేనున్న‌ది రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌డానికే అన్న‌ట్లుంది ఇప్పుడు ప‌వ‌న్ దూకుడు చూస్తుంటే. ఈయ‌న ఏం చేసినా అభిమానులు వెర్రిగా చూస్తున్నారు. ఇప్పుడు అజ్ఞాత‌వాసి టీజ‌ర్ కు వ‌స్తున్న రెస్పాన్స్ చూసి చిత్ర‌యూనిట్ కూడా షాక్ అయ్యుంటారు. క‌చ్చితంగా రికార్డులు తిర‌గ‌రాస్తుంద‌ని తెలుసు కానీ బాహుబ‌లి రికార్డుల్ని సైతం తుడిచేస్తుంద‌ని ఊహించ‌లేదు. అస‌లు క‌బాలి లాంటి సినిమాలైతే సీన్ లో కూడా క‌నిపించ‌ట్లేదు. ఒక్క మెర్స‌ల్ మాత్ర‌మే అజ్ఞాత‌వాసి కంటే ముందుంది. తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు మోస్ట్ లైక్డ్ టీజ‌ర్ గా చ‌రిత్ర సృష్టించాడు ప‌వ‌ర్ స్టార్. ఇక దానికితోడు కోటి వైపు ప‌రుగులు తీస్తుంది ఈ టీజ‌ర్. విడుద‌లైన రెండు రోజుల్లోనే కోటి మార్క్ అందుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదేమో..? ఇప్ప‌టికే 83 ల‌క్ష‌ల మంది ఈ టీజ‌ర్ ను వీక్షించారు. లైక్స్ ప‌రంగా కూడా 5 ల‌క్ష‌లు దాటిపోయింది. ఈ దూకుడు చూస్తుంటే సౌత్ ఇండియాలో మెర్స‌ల్ త‌ర్వాత రెండోస్థానాన్ని త‌న‌కే ఫిక్స్ చేసుకునేలా ఉన్నాడు ప‌వ‌ర్ స్టార్. ఇక టీజ‌రే ఈ రేంజ్ లో ఉంటే రేపు ట్రైల‌ర్ విడుద‌లైన త‌ర్వాత ఆ ర‌చ్చ ఊహించ‌డం కూడా క‌ష్టంగా ఉంటుందేమో..? అజ్ఞాత‌వాఇసి ఆడియో డిసెంబ‌ర్ 19న హైద‌రాబాద్ లోనే హైటెక్స్ లో జ‌ర‌గ‌బోతుంది. సినిమా జ‌న‌వ‌రి 10న విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here