అజ్ఞాత‌వాసి టీజ‌ర్.. ఎవ‌రేం అంటున్నారు..?

Agnyathavasi

అజ్ఞాత‌వాసి టీజ‌ర్ విడుద‌లైంది.. రికార్డుల‌ను కొల్ల‌గొడుతుంది ఈ టీజ‌ర్. ప‌వ‌న్ వ‌స్తూ వ‌స్తూనే చాలా మంది హీరోల‌కు డేంజ‌ర్ సిగ్నల్స్ పాస్ చేసాడు. ఈ టీజ‌ర్ తోనే తాను ఏ రేంజ్ లో బాక్సాఫీస్ ను కొల్ల‌గొట్ట‌బోతున్నానో హింటిచ్చాడు. ఇక ఇప్పుడు ఈ టీజ‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తుంది. టీజ‌ర్ మ‌రీ క్లాస్ గా ఉండ‌టంతో పాటు అత్తారింటికి దారేది ఛాయ‌లు క‌నిపిస్తున్నాయ‌ని చెబుతున్నారు కొంద‌రు. పైగా ప‌వ‌న్ లుక్ కూడా అచ్చంగా అత్తారింటికి దారేదిని గుర్తు చేస్తుండ‌టం.. అందులో ఇందులో రెండింట్లోనూ శ్రీ‌మంతుడిగానే ప‌వ‌న్ క‌నిపిస్తుండ‌టం.. న‌టులు కూడా ఆల్ మోస్ట్ సేమ్ టూ సేమ్ రిపీట్ అవ్వ‌డంతో అజ్ఞాత‌వాసి అత్తారింటిని గుర్తు చేయ‌డం కామ‌న్. కానీ టెక్నిక‌ల్ ప‌రంగా మాత్రం ఈ టీజ‌ర్ హై స్టాండ‌ర్డ్స్ లో ఉంది. ముఖ్యంగా మ‌ణికంద‌న్ కెమెరా వ‌ర్క్ అద్భుతంగా వ‌ర్క‌వుట్ అయింది. కీర్తిసురేష్, అను ఎమ్మాన్యువ‌ల్ కూడా అందంగా ఉన్నారు. ఓవ‌రాల్ గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ప‌ర్ ఫెక్ట్ ఫేర్ వెల్ గా ఈ చిత్రం ఉండ‌బోతుంద‌ని అర్థ‌మ‌వుతుంది. అయితే ఖుష్బూ ఫేస్ మాత్రం రివీల్ చేయ‌లేదు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్. డైలాగులు కూడా ఒక్క‌టీ విడుద‌ల చేయ‌లేదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here