అజ్ఞాత‌వాసి సెన్సార్ పూర్తి.. టాక్ ఏంటి..?

          
Agnyaathavaasi New Year Still
అజ్ఞాత‌వాసి సెన్సార్ పూర్తి చేసుకుంది. ప‌ది రోజుల ముందే సెన్సార్ పూర్తి చేసుకుంది చిత్రం. ఫ‌స్ట్ కాపీ కూడా రెడీ అయిపోయి.. ఇక విడుద‌ల మాత్ర‌మే బాకీ ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించాడు. ఈ చిత్రానికి యు బై ఎ స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. కామెడీతో పాటు యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కూడా కావ‌డంతో యు కు తోడుగా ఎ ఇచ్చారు. అంచనాల‌కు ఏ మాత్రం తీసిపోని రీతిలోనే అజ్ఞాతవాసి ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది. సెన్సార్ స‌భ్యుల నుంచి తెలిసిన స‌మాచారం ప్ర‌కారం అయితే.. సినిమా ఫ‌స్టాఫ్ అంతా కామెడీతో నిండి ఉంటుంది. ఇంట‌ర్వెల్ బ్లాక్ లో మాత్రం ప‌వ‌న్ కొంద‌రిని చంపుతూ వెళ్తుంటాడు. అది ఎందుకు అనేది సెకండాఫ్ లో తెలుసుకోవాల్సిందే. త‌న‌ను తాను ఎవ‌రో నిరూపించుకోడానికి ఓ వార‌సుడు చేసే ప్ర‌య‌త్న‌మే అజ్ఞాత‌వాసి అని తెలుస్తుంది. ప‌వ‌న్ 25వ సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై అంచ‌నాలు కూడా తారాస్థాయిలో ఉన్నాయి. జ‌న‌వ‌రి 10న అజ్ఞాత‌వాసి విడుద‌ల కానుంది. 9న ప్రీమియ‌ర్స్ ప‌డుతున్నాయి. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రం సంచ‌ల‌నాలు ఎలా ఉండ‌బోతున్నాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here