అత‌డి కోసం బ‌న్నీ, మ‌హేశ్ పోటీ..!


స్టార్ డైరెక్ట‌ర్ కావాల‌నుకున్నపుడు దొర‌క‌డు.. ముందు నుంచే ఆయ‌నపై క‌ర్ఛీఫ్ వేసుకుని కూర్చోవాలి. ఇప్పుడు స్టార్ హీరోలు ఇదే చేస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా సురేంద‌ర్ రెడ్డి కోసం ఇప్పుడు ఇద్ద‌రు స్టార్ హీరోలు చూస్తున్నార‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఈయ‌న సైరా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుండ‌గానే త‌ర్వాతి సినిమా కోసం పోటీ న‌డుస్తుంది. ఓ వైపు మ‌హేశ్ బాబు.. మ‌రోవైపు అల్లుఅర్జున్ ఈ ద‌ర్శ‌కుడి కోసం పోటీ ప‌డుతు న్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.
ఇప్ప‌టికే బ‌న్నీకి ఈయ‌న ఓ లైన్ చెప్పాడ‌ని.. ఇది ఆయ‌న‌కు న‌చ్చింద‌ని కూడా తెలుస్తుంది. అయితే ఇదే లైన్ ఓ సంద‌ర్భంలో మ‌హేశ్ కు కూడా చెప్పాడ‌ని ఆయ‌న‌కు కూడా ఇది బాగా న‌చ్చేసింద‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం విక్ర‌మ్ కే కుమార్.. త్రివిక్ర‌మ్ సినిమాల‌కు క‌మిట‌య్యాడు బ‌న్నీ. అలాగే మ‌హేశ్ కూడా వంశీ పైడిప‌ల్లి త‌ర్వాత సుకుమార్ సినిమా చేయ‌బోతున్నాడు. ఆ లోపు సైరా పూర్తి చేసుకుని మ‌రో క‌థ కూడా పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు సురేంద‌ర్ రెడ్డి.
ఆ టైమ్ కు ఎవ‌రు ఫ్రీగా ఉంటే వాళ్ల‌తో ఈ చిత్రం చేయాల‌ని చూస్తున్నాడు సూరి. అన్న‌ట్లు ఈ ఇద్ద‌రు హీరోల‌తోనూ గ‌తంలో ప‌ని చేసాడు సురేంద‌ర్ రెడ్డి. మ‌హేశ్ తో అతిథి.. బ‌న్నీతో రేసుగుర్రం చేసాడు. అయితే ఫ్లాప్ ఇచ్చిన మ‌హేశ్ తోనే మ‌రో సినిమా చేసి త‌న‌ బాకీ తీర్చుకోవాల‌ని చూస్తున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here