అనిరుధ్ ఏంటి అమ్మాయి అయ్యాడు..?


చూస్తున్నారుగా.. ఈ ఫోటోలో ఉన్న‌ది ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..? అచ్చంగా అనిరుధ్ లా ఉన్నాడేంటి.. కొంప‌దీసి అనిరుధ్దేనా..? ఎందుకు ఈ కుర్రాడు అమ్మాయిలా మారాడు..? న‌ట‌న వైపు అడుగేస్తున్నాడా అనే అనుమానాలు వ‌స్తున్నాయి క‌దా..? అవును.. ఈ మ‌ధ్య త‌మిళ హీరోలు అమ్మాయి గెట‌ప్పుల్లోకి బాగానే మారిపోతున్నారు. మొన్న‌టికి మొన్న విజ‌య్ సేతుప‌తితో పాటు శివ‌కార్తికేయ‌న్ కూడా అమ్మాయిల్లా మారిపోయారు. ఇదే క్ర‌మంలో ఇప్పుడు అనిరుధ్ కూడా గెట‌ప్ వేసుకున్నాడేమో అనుకుంటున్నారా..? అయితే మీరు త‌ప్పులో కాలేసిన‌ట్లే. ఎందుకంటే అక్క‌డున్న‌ది అనిరుధ్ కాదు. ఒక్కోసారి మ‌న క‌ళ్లు కూడా మ‌నల్ని మోసం చేస్తుంటాయి. మ‌నుషుల్ని పోలిన మ‌నుషులు ప్ర‌పంచంలో ఏడుగురు ఉంటార‌ని పెద్దోళ్లు చెబుతుంటారు క‌దా..? ఇక్క‌డ ఆడ‌ అనిరుధ్ మ‌న‌కు క‌నిపించాడు అంతే. ఈ ఫోటోలో క‌నిపిస్తున్న‌ది షానా అనే మోడ‌ల్. ఈ మ‌ధ్యే ఓ ఫోటో షూట్ కు వ‌చ్చిన షానాను చూసి అంతా షాక్ అయ్యారు. నిజంగానే అనిరుధ్ లేడీ గెట‌ప్ వేస్తే ఎలా ఉంటాడో.. అలాగే ఉంది షానా. స‌డ‌న్ గా చూసి అనిరుధ్ అనుకున్నారంతా. కానీ షానా అని తెలిసి ఓహో అనుకున్నారు. మొత్తానికి అనిరుధ్ తేడా లేడీ వ‌ర్ష‌న్ బాగానే హైలైట్ అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here