అనిరుధ్ వ‌ర్సెస్ దేవీ.. ఎవ‌రు గొప్ప‌..?

 
Anirudh shoots a promotional song as mark of tribute to Powerstar
టైమ్ అంటే ఇంతే మ‌రి. వారం రోజ‌లు కింది వ‌ర‌కు బాబు నువ్వు తోపు అన్నారు. కానీ ఇప్పుడు నువ్వు లేక‌పోతే బాగున్ను అంటున్నారు. అజ్ఞాత‌వాసి విడుద‌ల త‌ర్వాత అనిరుధ్ ఇమేజ్ ఒక్క‌సారిగా రివ‌ర్స్ అయిపోయింది. త‌మిళ్ లో నెంబ‌ర్ వ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా చ‌క్రం తిప్పుతున్న ఈ కుర్రాడు.. తెలుగు ఇండ‌స్ట్రీకి అజ్ఞాత‌వాసితో వ‌చ్చాడు. ఈ చిత్రం డిజాస్ట‌ర్ గా నిలిచింది. పైగా ఆడియో కూడా అనుకున్నంత‌గా స‌క్సెస్ కాలేదు. ప‌వ‌న్ సినిమా అంటే ఫ‌లితంతో ప‌నిలేకుండా పాట‌లు హిట్ అవుతాయి. కానీ ఈ సారి కూడా అది కూడా జ‌ర‌గ‌లేదు. కొడ‌కా కోటేశ్వ‌ర‌రావ్.. బ‌య‌టికొచ్చి చూస్తే త‌ప్ప మ‌రే పాట‌లు పెద్ద‌గా హిట్ కాలేదు. దాంతో ఇప్పుడు అంద‌రి దృష్టి దేవీ శ్రీ ప్ర‌సాద్ వైపు వెళ్తుంది. ఇదే సినిమాకు దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించి ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేదంటున్నారు అభిమానులు. సినిమా ఫ్లాప్ అయినా క‌చ్చితంగా కొన్ని సీన్స్ అయినా దేవీ సంగీతంతో నిల‌బ‌డేవంటున్నారు. అనిరుధ్ మ్యూజిక్ లో గిటార్ త‌ప్ప మ‌రేదీ వినిపించ‌లేద‌నే విమ‌ర్శ‌లున్నాయి. పైగా అన్ని పాట‌లు తనే పాడ‌టం ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా రుచించ‌లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎన్టీఆర్ సినిమాకు కూడా అనిరుధ్ నే తీసుకున్నాడు త్రివిక్ర‌మ్. ఈ సినిమాతో కానీ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆడియో ఇవ్వ‌క‌పోతే అనిరుధ్ ను మ‌రిచిపోక త‌ప్ప‌దు. అయితే ఇప్పుడు సీన్ లోకి స‌డ‌న్ గా దేవీ వ‌చ్చాడ‌ని తెలుస్తుంది. త‌న సినిమాకు అనిరుధ్ వ‌ద్ద‌ని.. దేవీ కావాల‌ని ఎన్టీఆర్ ప‌ట్టు ప‌డుతున్నాడ‌ని తెలుస్తుంది. మ‌రి చూడాలిక‌.. చివ‌రికి ఏం జ‌రుగుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here