అనుకున్న‌దే.. ఆఫీస‌ర్ వాయిదా..!


నాగార్జున ఆఫీస‌ర్ సినిమా పోస్ట్ పోన్ అయింది. ఈ చిత్రం మే 25న విడుద‌ల అవుతుంద‌ని ఎప్ప‌ట్నుంచో చెబుతున్నాడు వ‌ర్మ‌. మొన్న ఇంట‌ర్వ్యూ చేస్తున్న‌పుడు కూడా త‌న సినిమా అనుకున్న డేట్ కు వ‌స్తుంద‌న్నాడు కానీ ఇప్పుడు మాట మార్చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. పైగా ఆఫీసర్ కు నిర్మాత కూడా వ‌ర్మే కావ‌డం విశేషం. మే 25 నుంచి ఈ చిత్రాన్ని ఓ వారం పాటు వాయిదా వేసాడు వర్మ‌.
దానికి చాలా కార‌ణాలున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్ర సెన్సార్ పూర్తి కాలేదు. దానికి ఇంకా టైమ్ ఉంది కానీ అప్పుడు సినిమాలు చాలా వ‌స్తున్నాయి అందుకే పోటీ ఎందుకు అని సైలెంట్ గా సైడ్ అయిపోయాడు వ‌ర్మ‌. ఇప్పుడు జూన్ 1న ఆఫీస‌ర్ విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ చూస్తుంటే కొత్త‌గా అయితే ఏం అనిపించ‌లేదు.
కానీ వ‌ర్మ గ‌త సినిమాల‌తో పోలిస్తే క‌చ్చితంగా కాస్త బెట‌ర్ ఔట్ పుట్ క‌నిపిస్తుంది. అది నాగార్జున వ‌ల్లే కావ‌చ్చు. మ‌రి రేపు సినిమాలో కూడా ఇదే ఫీల్ వ‌స్తుందో రాదో చూడాలిక‌..! మే 24న నేల‌టికెట్.. 25న నా నువ్వే విడుద‌ల కానున్నాయి. అందుకే ఓ వారం ఆగి వ‌స్తున్నాడు ఈ ఆఫీస‌ర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here