అనుష్క‌కు షాక్ ఇచ్చిన పాక్..


అనుష్క అంటే మ‌న అనుష్క శెట్టి కాదండీ బాబూ..! బాలీవుడ్ బ్యూటీ అనుష్క శ‌ర్మ‌. ఈ భామ ప్ర‌స్తుతం ప‌రి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈమె న‌టించిన ప‌రి ఈ వార‌మే విడుద‌లైంది కూడా. ప్రోసిత్ రాయ్ తెర‌కెక్కించిన ఈ చిత్రానికి ఊహించిన రెస్పాన్స్ అయితే రాలేదు. ట్రైల‌ర్.. టీజ‌ర్స్ బాగానే భ‌య‌పెట్టినా.. సినిమా మాత్రం అంత భ‌య‌పెట్ట‌లేద‌ని చెబుతున్నారు ప్రేక్ష‌కులు. ఇప్ప‌టికే కొన్ని వంద‌ల సార్లు దెయ్యాల క‌థ‌లు చూసుంటాం.. ఈ దెయ్యాల క‌థ‌ల‌ను. అదే ఈ సినిమాకు మైన‌స్ గా మారింది. ఆక‌ట్టుకునే విధంగా స్క్రీన్ ప్లే లేక‌పోవ‌డంతో నిరాశ ప‌డుతు న్నారు ఫ్యాన్స్.. ప్రేక్ష‌కులు. ఎన్ హెచ్ 10 త‌ర్వాత అనుష్క నిర్మించిన సినిమా ఇది. హార్ర‌ర్ థ్రిల్ల‌ర్స్ లో ప‌రి క‌చ్చితంగా ట్రెండ్ సెట్ట‌ర్ అవుతుంద‌ని న‌మ్మిన అనుష్క‌కు ప‌రి షాక్ ఇచ్చేలా ఉంది. సినిమాకు నెగిటివ్ టాక్ వ‌చ్చింద‌ని ఓ వైపు ఫీల్ అవుతుంటే.. ఈ చిత్రాన్ని పాకిస్థాన్ లో ఆపేసారు. ఇస్లాంకు వ్య‌తిరేకంగా సినిమాలో సీన్స్ ఉన్నాయంటూ ఈ చిత్రాన్ని అక్క‌డ నిలిపేసారు. దాంతో అక్క‌డి క‌లెక్ష‌న్లు సినిమాపై ప్ర‌భావం చూపించ‌డం ఖాయం. మొత్తానికి ప‌రితో అనుష్క కోరుకున్న‌దేదీ జ‌ర‌గ‌డం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here