అనుష్క‌తో గోపీచంద్.. మ‌ళ్లీ కలుస్తున్నారా..?


తెలుగులో కొన్ని కాంబినేష‌న్ ల‌కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. వాళ్లు క‌లిసి న‌టిస్తూ చూడాల‌నుకునే ప్రేక్ష‌కులు.. అభిమానులు చాలా మంది ఉంటారు. అలాంటి ఓ జంట అనుష్క‌, గోపీచంద్. కెరీర్ మొద‌ట్లో అనుష్క‌తో గోపీచంద్ చాలా సాన్నిహిత్యంగా ఉన్నాడు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ కూడా న‌డిచింద‌నే వార్త‌లున్నాయి. అప్ప‌ట్లో ఈ ఇద్ద‌రూ క‌లిసి ల‌క్ష్యం.. శౌర్యం సినిమాల్లో న‌టించారు కూడా.
ఈ రెండూ హిట్ సినిమాలే. ఇన్నేళ్ల త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ క‌లిసి న‌టించ‌బోతున్నారు అనే వార్త‌లొస్తున్నాయి. అది కూడా ఓ క్లాస్ ద‌ర్శ‌కుడితో..! క‌ళ్యాణ్ రామ్ తో నా నువ్వే సినిమా తెర‌కెక్కించిన జయేంద్ర‌తో గోపీచంద్ సినిమా చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. ఇందులో అనుష్క హీరోయిన్ గా న‌టించ‌బోతుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. దీన్ని నా నువ్వేను నిర్మించిన కిరణ్ ముప్పవరపు, విజయ్ కుమార్ వట్టికూటిలు నిర్మించ‌బోతున్నార‌ని తెలుస్తుంది.
ఇప్ప‌టి వ‌ర‌కు ఇంకా క‌న్ఫ‌ర్మేష‌న్ రాక‌పోయినా.. త్వ‌ర‌లోనే ఈ కాంబినేష‌న్ పై అనౌన్స్ మెంట్ మాత్రం రానుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం గోపీచంద్ చ‌క్రి ద‌ర్శ‌క‌త్వంలో పంతం సినిమా చేస్తున్నాడు. ఇక అనుష్క అయితే ఖాళీగానే ఉంది. మ‌రి చూడాలిక‌.. ఈ కాంబినేష‌న్ లో రాబోయే సినిమా హ్యాట్రిక్ అవుతుందో లేదో..?
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here