అనుష్క ఇంకా త‌గ్గ‌లేద‌మ్మా..!

 
Anushka
ఈ మ‌ధ్య బ‌య‌ట క‌నిపించడ‌మే మానేసింది అనుష్క‌. అప్పుడెప్పుడో భాగ‌మ‌తి టైమ్ లో ప్ర‌మోష‌న్స్ కోసం బ‌య‌టికి వ‌చ్చిన ఈ భామ‌.. ఈ మ‌ధ్యే కేదార్ నాథ్ యాత్ర కోసం మ‌రోసారి క‌నిపించింది. ఇక ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ ద‌ర్శ‌న‌మిచ్చింది అనుష్క‌. ఈ సారి కూడా పెద్ద‌గా మార్పేం లేదు. అదే పాత రూపంలోనే క‌నిపించింది.
బ‌రువు త‌గ్గ‌ని భారీ రూపంలోనే భాగ‌మ‌తి ఇంకా ఉంది. ఇప్పుడు ఆమె రూపం చూసిన త‌ర్వాత అర్థం అవుతుంది ఎందుకు అనుష్క‌కు ఇప్పుడు అవ‌కాశాలు రావ‌ట్లేద‌నే సంగ‌తి. సైజ్ జీరో నుంచి ఉన్న సైజే ఇప్ప‌టికీ మెయింటేన్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. దాంతో సీనియ‌ర్ హీరోల‌కు కూడా స‌రిపోని స్థాయిలో మారిపోయింది జేజ‌మ్మ‌. ఇప్పుడు ఈ భామ సినిమాలు ఒప్పుకోక‌పోవ‌డం కాదు.. ఈమెకు రావ‌డం లేదు.
చాలారోజుల త‌ర్వాత బ‌య‌టికి వ‌చ్చిన అనుష్క‌ను చూసి అభిమానులు కూడా ఇదే షాక్ అవుతున్నారు. చూడ్డానికి బొద్దుగా ఉంది కానీ హీరోయిన్ గా మాత్రం ఇలా ఉంటే అవ‌కాశాలు ఎలా వ‌స్తాయి అంటున్నారు. అలాగ‌ని ఆంటీ పాత్ర‌లు ఇప్ప‌ట్నుంచే చేయ‌డం అనుష్క నుంచి ఊహించ‌లేం. మ‌రి చూడాలిక‌.. ఈ భాగ‌మ‌తి కెరీర్ ఎలా ముందుకెళ్ల‌నుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here