అను.. అయ్యో జాత‌కం తిర‌గ‌బ‌డిందే..!

Anu Emmanuel Launch B New Mobile Store At Yemmiganur
అంతే.. ఇండ‌స్ట్రీలో అంతే.. జాత‌కం తిర‌గ‌బ‌డానికి.. నిల‌బ‌డ‌టానికి ఒక్క సినిమా చాలు. అను ఎమ్మాన్యువ‌ల్ నే తీసుకోండి. మొన్న‌టి వ‌ర‌కు ఈ భామ పేరు మారుమోగిపోయింది. కానీ ఏం చేస్తాం.. ఆశ‌లు పెట్టుకున్న ఆక్సీజ‌న్ కొంప ముంచేసింది. నిల‌బెడ‌తాడు అనుకున్న అజ్ఞాత‌వాసి త‌న కెరీర్ నే అజ్ఞాతంలోకి నెట్టేసాడు. ఇక ఇప్పుడు ఈమె ఆశ‌ల‌న్నీ నా పేరు సూర్య‌పైనే ఉన్నాయి. బ‌న్నీ లాంటి స్టార్ హీరో సినిమా కావ‌డంతో ఈ భామ ఆశ‌ల‌న్నీ ఇప్పుడు ఈ చిత్రంపైనే ఉన్నాయి. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే.. మ‌రోవైపు ఫోటోషూట్ల‌లో రెచ్చిపోతుంది ఈ కేర‌ళ‌కుట్టి. పైగా సినిమాల్లోనూ అమ్మాయి గారు ఫుల్ గా రెచ్చిపోతారు. అందాల ఆర‌బోత‌కు ఎలాంటి అడ్డంకులు లేక‌పోవ‌డంతో అను ఎమ్మాన్యువ‌ల్ కు ఫ్లాపులు ఉన్నా కూడా నువ్వే అర‌కొర అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం నా పేరు సూర్య‌లో న‌టిస్తున్న అను.. త‌ర్వాత నాగ‌చైత‌న్య‌తో మారుతి తెర‌కెక్కిస్తోన్న సినిమాలో ఎంపికైంది. ఈ చిత్రంలో అనుకు అవ‌కాశం రావ‌డానికి కార‌ణం త్రివిక్ర‌మ్ అని తెలుస్తుంది. అజ్ఞాత‌వాసి టైమ్ లోనే అను వ‌ర్క్ మెచ్చిన మాట‌ల మాంత్రికుడు.. మారుతి సినిమాలో రిఫ‌ర్ చేసాడు. ఈ చిత్ర నిర్మాత రాధాకృష్ణ కావ‌డంతో ప‌ని సులువైపోయింది. మొత్తానికి ఇప్పుడు నాగ‌చైత‌న్య‌.. బ‌న్నీ సినిమాలు ఆడితే కానీ అనుకు మంచి రోజులు రాన‌ట్లే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here