అన్నాద‌మ్ముల‌కు ల‌వ‌ర్ ఒక్క‌టేనా..?

AKHIL NIDHI AGARWAL NAGA CHAITANYA
అన్నాద‌మ్ముల‌కు ఒక్క‌టే ల‌వర్ అంటే త‌ప్పుగా అనుకోవ‌ద్దు. సినిమాల్లో ఇవ‌న్నీ కామ‌న్. ఫ్యామిలీలో ఇద్ద‌రు హీరోలున్నపుడు హీరోయిన్ల కుండ మార్పిడి జ‌రుగుతుంటుంది. అన్న‌య్య హీరోయిన్ తో త‌మ్ముడు.. త‌మ్ముడి హీరోయిన్ తో అన్న‌య్య న‌టిస్తుంటారు. ప్ర‌తీ ఇండ‌స్ట్రీలోనూ కామ‌న్ ఇది.
ఇప్పుడు అక్కినేని బ్ర‌ద‌ర్స్ కూడా ఇదే అలవాటు చేసుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు తండ్రితో న‌టించిన లావ‌ణ్య త్రిపాఠితో నాగ‌చైత‌న్య న‌టిం చాడు. కానీ ఇప్పుడు నాగ‌చైత‌న్య‌తో న‌టించిన హీరోయిన్ తో అఖిల్ కూడా రొమాన్స్ చేయ‌బోతున్నాడు. స‌వ్యసాచితో చైతూతో రొమాన్స్ చేస్తోన్న నిధి అగర్వాల్ నే ఇప్పుడు అఖిల్ మూడో సినిమాలో హీరోయిన్ గా అనుకుంటున్నారు. వెంకీ అట్లూరి తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌లు కానుంది. ఈ చిత్రంలో ముందు కొత్త హీరోయిన్ ను అనుకున్నా కూడా అఖిల్ భ‌య‌ప‌డుతున్నాడు.
స‌యేషా సైగ‌ల్.. క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ ఈ కుర్ర హీరోకు క‌లిసిరాలేదు. ఇద్ద‌రూ కొత్త భామలే.. అఖిల్, హ‌లో రెండూ ప్లాపులే. దాంతో మూడో సినిమాకు మాత్రం పాత హీరోయిన్ వైపు అడుగేస్తున్నాడు అక్కినేని వార‌సుడు. మ‌రి చూడాలిక‌.. అన్న‌య్య హీరోయిన్ తోనైనా అఖిల్ జాత‌కం మారుతుందో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here