అన్న‌య్య‌కే తొలిపోటు వేసిన అజ్ఞాత‌వాసి..

AGANATHAVASI 1ST DAY COLLECTIONS
సినిమా టాక్ తో అవ‌స‌రం లేదు.. తొలిరోజు రికార్డులైతే అంద‌రూ ఊహించిన‌ట్లే అన్ని చోట్లా క‌దిలిపోయాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ దెబ్బ‌కు బాక్సాఫీస్ కుదేలైంది. తొలిరోజు చాలా చోట్ల త‌న‌దైన మార్క్ చూపించాడు ప‌వ‌ర్ స్టార్. ఇక ఓవ‌ర్సీస్ లో అయితే అన్న‌య్యే పోటేసాడు. ఓవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు అచ్చొచ్చిన మంగ‌ళ‌వారం ప్రీమియ‌ర్స్ కావ‌డంతో అడ్డే లేకుండా పోయింది. ముందు రోజు రాత్రి వేసే ప్రీమియ‌ర్స్ తోనే 1.5 మిలియ‌న్ అందుకున్న ప‌వ‌న్.. తొలిరోజు వ‌సూళ్లతో క‌లిపి దాదాపు 1.8 మిలియ‌న్ వ‌ర‌కు వ‌సూళ్ళు తీసుకురావ‌డం ఖాయ‌మైపోయింది. నాన్ బాహుబ‌లి కేట‌గిరీ ఎవ‌రికి అంద‌నంత ఎత్తులో ఉన్నాడు ప‌వ‌ర్ స్టార్. ఇప్ప‌టికే ఖైదీ నెం.150 పేరుమీదున్న 1.2 మిలియ‌న్ ప్రీమియ‌ర్స్ రికార్డును తమ్ముడు తిర‌గ‌రాసాడు. ఇక ఇండియాలోనూ అజ్ఞాత‌వాసి భారీగా ఓపెన్ అయింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఈజీగా తొలిరోజు 30 కోట్ల షేర్ అందుకుంద‌ని తెలుస్తుంది. ఇది ఖైదీ నెంబ‌ర్ 150కి బ్రేక్ వేసిన‌ట్లే. ఈ చిత్రం తొలిరోజు 23 కోట్లతో రికార్డ్ సృష్టించింది. నాన్ బాహుబ‌లిలో చిరుదే రికార్డ్. ఇప్పుడు అన్న‌య్య రికార్డులు త‌మ్ముడు బ‌ద్ద‌లుకొట్టాడు. ఓవ‌రాల్ డే వ‌న్ క‌లెక్ష‌న్ల‌లో కూడా అజ్ఞాత‌వాసిపై పై చేయిలా క‌నిపిస్తుంది. ఈ చిత్రం తొలిరోజు 40 కోట్ల వ‌రకు షేర్ తీసుకొచ్చిన‌ట్లు తెలుస్తుంది. ఇదే జ‌రిగితే 35 కోట్ల‌తో ఖైదీ నెం.150 పేరుమీదున్న రికార్డ్ కు తెర ప‌డిన‌ట్లే. అయితే ఇప్పుడు టాక్ చూస్తుంటే ప‌వ‌న్ ప్ర‌యాణం ఎంతోదూరం వెళ్లేలా క‌నిపించ‌ట్లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here