అన‌సూయకు షాకిచ్చిన భ‌ర్త భ‌రద్వాజ్..

ANASUYA IN MALDIVS WITH HUSBEND
సాధార‌ణంగా తెలుగులో యాంక‌ర్ అయినా.. హీరోయిన్ అయినా త‌మ‌కు పెళ్లి అయింది అని చెప్పుకోడానికి కాస్త ఆలోచిస్తారు. అయినా భ‌ర్త‌ల‌తో క‌లిసి ఎక్కువ‌గా క‌నిపించ‌రు. అలా క‌నిపిస్తే ఎక్క‌డ త‌మ‌ను ఆంటీలు అనేస్తారేమో అని. కానీ అన‌సూయ మాత్రం చాలా భిన్నం.
త‌న భ‌ర్త భ‌ర‌ద్వాజ్ తో క‌లిసి ఎప్పుడూ బ‌య‌ట క‌నిపిస్తూనే ఉంటుంది. మొన్న కూడా స‌మ్మ‌ర్ ట్రిప్ కోసం ఏకంగా పాకిస్థాన్ బోర్డ‌ర్ వ‌ర‌కు వెళ్ళొచ్చింది ఈ భామ‌. ఇక ఇప్పుడు మ‌రోసారి ట్రిప్ అంటూ బ‌య‌టికి వెళ్లిపోయింది. అస‌లు విష‌యం ఏంటంటే జూన్ 4న అన‌సూయ పెళ్లిరోజు. దాంతో ఎంచ‌క్కా భర్త‌తో క‌లిసి మాల్దీవ్స్ కు వెళ్లిపోయింది అను. అక్క‌డే హాయిగా ఎంజాయ్ చేస్తుంది. నిజానికి ఈ టూర్ త‌న‌కు తెలియ‌కుండానే భ‌ర‌ద్వాజ్ ప్లాన్ చేసాడంటుంది ఈ భామ‌. భ‌ర్త ఇచ్చిన స‌ర్ ప్రైజ్ ను బాగానే ఎంజాయ్ చేస్తుంది అన‌సూయ‌. ఇక ఇప్పుడు టీవీల్లోనే కాదు..
పెద్ద తెర‌పై కూడా బాగానే క‌నిపిస్తుంది అనసూయ‌. రంగ‌స్థ‌లం ఈమె కెరీర్ కు ట‌ర్నింగ్ పాయింట్. ఈ చిత్రం త‌ర్వాత న‌టిగా కూడా బిజీ అయిపోయింది అను. తాజాగా అనిల్ రావిపూడి ఎఫ్ 2లోనూ పెద్ద రోల్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది. ఈ ఫ్యామిలీ టూర్ అయిపోయిన త‌ర్వాత వ‌చ్చి మ‌ళ్లీ సీజ‌న్ ను ఫ్రెష్ గా మొద‌లు పెట్ట‌నుంది అనసూయ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here