అప్పుడు- ఇప్పుడు ఫస్ట్ లుక్ విడుదల


యు.కె.ఫిలింస్ పతాకంపై ఉషా రాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు సంయుక్తంగా నిర్మిస్తొన్న చిత్రం “అప్పుడు- ఇప్పుడు” . చలపతి పువ్వల దర్శకుడు. సుజన్, తనీష్క్ హీరో హిరొయిన్ లుగా నటిస్తుంటగా ,శివాజీరాజా ,మళ్లీ రావా ఫేం పేరుపు రెడ్డి శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లొ కన్పించనున్నారు.
చిత్రీకరణ పూర్తి చెసుకుని , నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విళంబినామ ఉగాది పర్వదినం‌ సందర్బంగా విడుదల చేశారు.
ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతొన్న ఈ చిత్రాన్ని సమ్మర్ లొ విడుదల చెసెందుకు సన్నాహాలు చెస్తున్నారు.
సుజన్, తనీష్క్ ,శివాజీరాజా, శ్రీనివాస్ పేరుపురెడ్డి, మాధవి, జబర్దస్త్ అప్పారావు తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి కెమెరా: కల్యాణ్ సమి,ఆర్ట్: ఠాగూర్, ఎడిటింగ్: వి.వి.ఎన్.వి. సురేష్ ,సంగీతం: పద్మానావ్ భరద్వాజ్, నిర్మాతలు: ఉషారాణి కనుమూరి, విజయ్ రామ కృష్ణమ్ రాజు, దర్శకత్వం: చలపతి పువ్వల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here