అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు ర‌వితేజ‌..


ఈ మ‌ధ్య మ‌న హీరోల‌కు ధైర్యం బాగా పెరిగిపోతుంది. క‌థ న‌చ్చ‌డ‌మే ఆల‌స్యం.. ఎంత‌టి సాహ‌సానికైనా సిద్ధం అంటున్నారు. ఇప్పుడు ర‌వితేజ కూడా ఇదే చేస్తున్నాడు. ఈయ‌న శీనువైట్ల‌తో సినిమా చేయ‌బోతున్నాడు. ఇన్నాళ్లూ కేవ‌లం రూమ‌ర్ గానే ఈ వార్త‌ను ర‌వితేజే క‌న్ఫ‌ర్మ్ చేసాడు. తాను వైట్ల‌తో సినిమా చేయ‌బోతున్న‌ట్లు అనౌన్స్ చేసాడు మాస్ రాజా. క‌థ న‌చ్చింది కాబ‌ట్టే సినిమా చేస్తున్నాను కానీ గ‌తంలో త‌న‌కు హిట్లు ఇచ్చాడ‌ని.. లైఫ్ ఇచ్చాడ‌ని.. స్నేహితుడు అని కాద‌న్నాడు ర‌వితేజ‌. అయినా ఇండ‌స్ట్రీలో ఎవ‌రూ ఎవ‌రికీ ఎప్పుడూ లైఫ్ ఇవ్వ‌డ‌ని ఓపెన్ గానే స్టేట్ మెంట్ ఇచ్చేసాడు ర‌వితేజ‌. నిజంగానే శీనువైట్ల చెప్పిన క‌థ న‌చ్చింద‌ని.. అందుకే త‌న‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని చెప్పాడు మాస్ రాజా. అయితే ఇక్క‌డే చిన్న ట్విస్ట్ కూడా ఉంది. వైట్ల ఇప్ప‌టికిప్పుడు ర‌వితేజ‌కు ఎలాంటి క‌థ చెప్పి ఉండొచ్చ‌నే ఆస‌క్తి అయితే వినిపిస్తున్నాయి. దీనికి ఓ క్లారిటీ వ‌చ్చింది. ఇందులో ర‌వితేజ మూడు పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్నాడు. దీనికి అ..అ..అ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఫుల్ నేమ్. గ‌తంలో ఈ టైటిల్ తో ఓ సినిమా వ‌చ్చింది. ఇప్పుడు శీనువైట్ల ఇదే ట్రై చేస్తున్నాడు. గ‌తేడాది జై ల‌వ‌కుశ‌లో త్రిపాత్రాభిన‌యం చేసి అద‌ర‌గొట్టాడు ఎన్టీఆర్. ఇప్పుడు ఆ సాహ‌సం ర‌వితేజ చేయ‌బోతున్నాడు. త‌న స్టైల్లోనే క‌థ‌ను పూర్తి కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా సిద్ధం చేస్తున్నాడు శీనువైట్ల‌. ఎప్రిల్లో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు మాస్ రాజా. ఇదే ఏడాది శీనువైట్ల సినిమా కూడా విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. పాత స్నేహితుడైనా శీనువైట్ల‌ను క‌రుణిస్తాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here