అఫీషియ‌ల్.. నానికి ఫ్లాప్ వ‌చ్చింది..


ఫ్లాప్.. హిట్ ఇండ‌స్ట్రీలో కామ‌న్. కానీ నాని మాత్రం మూడేళ్లుగా హిట్ అనే మాట మాత్ర‌మే వింటున్నాడు. ఏ సినిమా వ‌చ్చినా కూడా సినిమా హిట్ అని చెప్పేస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఏ హీరో కూడా ఇలాంటి జైత్ర‌యాత్ర చేయ‌లేదు. వ‌చ్చిన సినిమా వ‌చ్చిన‌ట్లు బాక్సాఫీస్ ను కుమ్మేయ‌డం అంటే మాట‌లు కాదు.
కానీ నాని అది చేసాడు. ఎంసిఏ వ‌ర‌కు కూడా ఈయ‌న దూకుడు సాగింది. కానీ 2018 మాత్రం నానికి వ‌స్తూ వ‌స్తూనే షాక్ ఇచ్చేసింది. మొన్నొచ్చిన కృష్ణార్జున యుద్ధంతో నానికి బ్రేకులు ప‌డిపోయాయి. ఈ చిత్రం ఇప్పుడు కోలుకోవ‌డం క‌ష్టంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 14 కోట్ల షేర్ మాత్ర‌మే వ‌సూలు చేసింది ఈ చిత్రం.
ఇంకా 16 కోట్లు వ‌స్తే కానీ సినిమా సేఫ్ కాదు. ఇప్పుడు చూస్తుంటే అంత వ‌చ్చేలా అస్స‌లు క‌నిపించ‌ట్లేదు. పైగా ఓవ‌ర్సీస్ లో రెండో రోజు డిజాస్ట‌ర్ అని డిసైడ్ చేసారు ప్రేక్ష‌కులు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుంది. ఈ సీన్ అంతా చూస్తుంటే 2015 త‌ర్వాత నానికి బ్రేకులు ప‌డ్డ‌ట్లు అర్థ‌మైపోతుంది. ఇప్పుడు కానీ రూట్ మార్చి కొత్త‌గా ట్రై చేయ‌క‌పోతే నానికి మ‌రిన్ని షాకులు త‌గ‌ల‌డం ఖాయం. మ‌రి ఈ ఫ్లాప్ ను మ‌రిచిపోయి.. మ‌ళ్లీ శ్రీ‌రామ్ ఆదిత్య సినిమాతో నాని హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలిక‌..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here