అబ్బో.. త‌మ‌న్నా చాలానే ఆర‌బోసిందిగా..


త‌మ‌న్నా అంటేనే పాలుగారే అందాలు గుర్తొస్తాయి. సీనియ‌ర్ హీరోయిన్ అయినా కూడా ఇప్ప‌టికీ అందాలే ఆయుధంగా ముంద‌డుగు వేస్తుంది ఈ భామ‌. ఇప్పుడు కూడా క‌ళ్యాణ్ రామ్ నా నువ్వేలో త‌మ‌న్నా అందాలే ప్ర‌ధానాక‌ర్ష‌ణ‌. ట్రైల‌ర్.. టీజ‌ర్.. పాట‌లు.. ఇలా ఏది తీసుకున్నా త‌మ‌న్నా ధ‌గ ధ‌గ‌లు మెరిసిపోతున్నాయి. ముఖ్యంగా సాల్సా డాన్స్ లో క‌ళ్యాణ్ రామ్ తో త‌మ‌న్నా రొమాన్స్ చూసి అబ్బో అనుకుంటున్నారంతా.
అంత‌గా రెచ్చి పోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఈ చిత్రానికి త‌మ‌న్నా గ్లామ‌ర్ ఓపెనింగ్స్ తీసుకొస్తుంద‌న‌డంలో అత‌శ‌యోక్తి లేదేమో..? గ‌తంలోనూ బద్రీనాథ్ లాంటి సినిమాల‌కు త‌మ‌న్నా గ్లామ‌ర్ ఆయుధంగా ప‌నికొచ్చింది. ఇన్నాళ్లూ స్టార్ హీరోల‌తోనూ న‌టిస్తూ వ‌చ్చిన త‌మ‌న్నా.. ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ లాంటి మీడియం రేంజ్ హీరోల‌తోనూ న‌టించ‌డానికి రెడీ అవుతుంది.
నా నువ్వే సెన్సార్ కూడా పూర్తైపోయింది. ఈ చిత్రానికి క్లీన్ యు స‌ర్టిఫికేట్ ఇచ్చారు. జూన్ 14న విడుద‌ల కానుంది ఈ చిత్రం. మ‌రి చూడాలిక‌.. షేర్.. యిజం.. ఎమ్మెల్యేతో హ్యాట్రిక్ ఫ్లాప్ పూర్తి చేసిన క‌ళ్యాణ్ రామ్ ఈ చిత్రంతోనైనా హిట్ కొడ‌తాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here