అభిమ‌న్యుడు.. ప్ర‌మోష‌న్ ప్ర‌మోష‌న్ ప్లీజ్..


కొన్ని సినిమాల‌కు అద్భుత‌మైన టాక్ వ‌స్తుంది కానీ ప్ర‌మోష‌న్ స‌రిగ్గా లేక పోతుంటాయి. అలాంటివి ఎన్నో సినిమాలున్నాయి. ఇక ఇప్పుడు విడుద‌లైన విశాల్ అభిమ‌న్యుడుకు కూడా టాక్ బ్ర‌హ్మాండంగా వ‌చ్చింది. డిజిట‌ల్ క్రైమ్ ను బేస్ చేసుకుని ద‌ర్శ‌కుడు మిత్ర‌న్ చేసిన ప్ర‌య‌త్నం అద్భుతం.
ఈ చిత్రం చూసిన త‌ర్వాత క‌నీసం ఒక్క‌సారైనా మ‌ళ్లీ మ‌న స్మార్ట్ ఫోన్ ఇష్ట‌మొచ్చిన‌ట్లు వాడాలంటే భ‌య‌ప‌డ‌తాం. అంత‌గా నిజాలు చూపించాడు ఈ చిత్రంలో. అయితే ఈ చిత్రానికి ఇప్పుడు ప్ర‌మోష‌న్ అవ‌స‌రం. అది చేయ‌క‌పోతే డ‌బ్బింగ్ సినిమా కాబ‌ట్టి ప్రేక్ష‌కుల ద‌గ్గ‌రికి రాక ముందే థియేట‌ర్స్ లోంచి బ‌య‌టికి వెళ్లే ప్ర‌మాదం లేక‌పోలేదు.
నాటి అభిమన్యుడు ప‌ద్మ‌వ్యూహంలోకి వెళ్లి బ‌య‌టికి రాలేక‌పోయాడు. కానీ ఈ అభిమ‌న్యుడు ప్ర‌మోష‌న్ చేసుకుంటే బాక్సాఫీస్ అనే ప‌ద్మవ్యూహాన్ని చీల్చుకుంటూ గెలుపుతో బ‌య‌టికి వ‌స్తాడు. పైగా విశాల్ తో పాటు స‌మంత‌, అర్జున్ కూడా ఈ చిత్రానికి ప్రాణం.వాళ్ల ఇమేజ్ కూడా సినిమాకు క‌లిసిరానుంది. మ‌రి చూడాలిక‌.. దీనికి ఏ రేంజ్ ప్ర‌మోష‌న్ చేస్తారో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here