అమీజాక్స‌న్ అన్నీ వ‌దిలేసిందా..? 


అమీజాక్స‌న్.. పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు ఇది. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ ఇండ‌స్ట్రీల్లోనూ త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు అభిమానుల‌కు ఓ షాక్ ఇవ్వ‌బోతుంది. సినిమాలు ఇక చాలు అని నిర్ణ‌యానికి వ‌చ్చేసింది అమీ. ఇప్పుడు అంత క‌ష్టం ఏమొచ్చింది.. ఈ నిర్ణ‌యం తీసుకోడానికి కార‌ణం ఏంటి అనుకుంటున్నారా..? ఏం లేదండి.. ఇండియ‌న్ సినిమా త‌న‌కు పెద్ద‌గా క‌లిసి రావ‌డం లేదు అనే ఊహ‌ల్లోనే ఉంది అమీజాక్స‌న్. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని సినిమాలు చేసినా సూప‌ర్ స్టార్ స్టేట‌స్ మాత్రం రాలేదు అమీజాక్స‌న్. విక్ర‌మ్.. విజ‌య్.. రామ్ చ‌ర‌ణ్ లాంటి స్టార్స్ తో న‌టించినా కూడా అమీ స్టార్ హీరోయిన్ కాలేదు. ఇప్ప‌టికీ అవ‌కాశాల కోసం అడపాద‌డ‌పా చూస్తూనే ఉంది అమీజాక్స‌న్. ప్ర‌స్తుతం 2.0 సినిమాలో ర‌జినీకాంత్ తో రొమాన్స్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ సినిమా త‌ర్వాత అమ్మాయిగారు ఇండియ‌న్ సినిమా నుంచి సెల‌వు తీసుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఈ భామ హాలీవుడ్ ఓ సీరియ‌ల్ లో న‌టిస్తుంది. ఈ సీరియ‌స్ రెండో సీజ‌న్ కు కూడా అమీనే ఎంచుకున్నారు. దాంతో ఇండియ‌న్ సినిమాకు బ్రేక్ ఇచ్చి.. పూర్తిగా హాలీవుడ్ పైనే దృష్టి పెట్ట‌నుంది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తానికి చూడాలిక‌.. అమీ తీసుకున్న ఈ నిర్ణ‌యం ఈమె కెరీర్ ను ఎటువైపు తిప్ప‌నుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here