“అమీర్ పేట్ టు అమెరికా” ట్రైలర్ విడుదల

రాధా మీడియా బ్యానర్ పై శ్రీమతి స్వప్న కొమండూరి సమర్పించు చిత్రం అమీర్ పేట్ టు అమెరికా. ఈ  చిత్ర మొదటి  ట్రైలర్ ను నటుడు తనికెళ్ళ భరణి విడుదల చేయగా రెండవ ట్రైలర్ ను రవికుమార్ లాంచ్ చేశారు.  బందూక్ లక్ష్మణ్, డా. శ్రీనివాస్, నిర్మాత పద్మజ, కాసర్ల శ్యామ్, నటి మణిచందన, డా. రాజేశ్వరి, అంబర్ పేట్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్, మల్లన్న, సత్తి, మంగ్లీ, గాంధీ, గాయత్రి గుప్తా తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆదివారం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది.  ఈ సందర్బంగా తలికెళ్ల భరణి మాట్లాడుతూ  టైటిల్ చాలా రియలిస్టిక్ గా ఉంది… ప్రతి ఇంటినుంచి ఒక్కరు ఖచ్చితంగా అమెరికాలో ఉన్న వారే.. అమీర్ పేట్ టు అమెరికా ఈ ప్రయాణాన్నంతా ఈ సినిమాలో చూపించడం జరిగింది.. నేను ఇందులో మంచి పాత్రను పోషించాను, ఈ సినిమాకు అన్నీ తానై రామ్మోహన్ భుజాలమీద వేసుకున్నారు.. అంతే కస్టపడి సినిమాను తెరకెక్కించారు.. యూత్ ను అలరించే అన్నీ అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి.. మర్చి 30న ఈ చిత్రం విడుదల చేయనున్నారు.. తప్పకుండా మంచి విజయం సాదిస్తుందని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ టు యూనిట్ అన్నారు. ఈ చిత్రానికి కథ, కర్మ, క్రియ అయినటువంటి రామ్మోహన్ కొమండూరి మాట్లాడుతూ 80% ఈ చిత్రాన్ని అమెరికాలో మిగతా 20% ఇండియాలో చిత్రీకరించాము, అమీర్ పేట్ టు అమెరికా వెళ్లే వారి లైఫ్ స్వర్గం లా అనిపిస్తుంది. కానీ డాలర్ సంపాదించుకోవడానికి వారు చాలా కస్టాలు పడుతారు… ఆ సంఘటనలని  ఈ సినిమాలో చూపించడం జరిగింది. పెద్ద కాస్టింగ్ తో పాటు  ఇద్దరు ప్రముఖ మినిస్టర్స్ ఈ సినిమాలో నటించారు. పెద్ద ఎత్తున ఈనెల 23న ఆడియో విడుదల చేసి నెలాఖరు 30న చిత్రాన్ని విడుదల చేస్తాము అన్నారు. నిర్మాత పద్మజ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన రామ్మోహన్ గారు నా మరిది.. సినిమాను చాలా కష్టపడి తీశారు… నటీనటులు అందరూ ఎంతో సహకరించారు.. మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా కనుక తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా అన్నారు.
కర్త -కర్మ-క్రియ: రామ్మోహన్ కొమండూరి  మరియు భానుకిరణ్ చల్లా, నిర్మాత: పద్మజ కొమండూరి, మ్యూజిక్: కార్తీక్ కొడకండ్ల, సినిమాటోగ్రఫీ: అరుణ్ ఐ కె సి, జి.ల్. బాబు, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here