అమెరికా వెళ్లిన చ‌ర‌ణ్-ఎన్టీఆర్.. 


తెలుగు ఇండ‌స్ట్రీలో గ‌త 30 ఏళ్ళ‌లో ఎప్పుడూ లేని ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ కు రాజ‌మౌళి రంగం సిద్ధం చేస్తున్నాడు. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల‌తో ఈయ‌న ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ రాలేదు కానీ చేయాల్సిన ప‌నుల‌న్నీ వేగంగా చేస్తున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. ఇప్ప‌టికే క‌థ సిద్ధం చేసాడు.. త‌న హీరోల‌ను సిద్ధం చేసుకుంటున్నాడు.. ఈ చిత్ర షూటింగ్ అక్టోబ‌ర్ లో మొద‌లు కానుంది. ఆ లోపు త‌న‌కు కావాల్సిన‌ట్లుగా త‌న హీరోల‌ను మార్చుకునే ప‌నిలో బిజీగా ఉన్నాడు జ‌క్క‌న్న‌. ఇందులో భాగంగానే ఇద్ద‌రికీ వ‌ర్క్ షాప్ ఒక‌టి ఏర్పాటు చేస్తున్నాడు రాజ‌మౌళి. అక్క‌డే ప‌ది రోజుల పాటు ఉండ‌బోతున్నారు ఈ ఇద్ద‌రు హీరోలు.
మార్చ్ 7న అమెరికా వెళ్లారు చ‌ర‌ణ్, ఎన్టీఆర్. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇద్ద‌రూ బ్యాగులు ప‌ట్టుకుని కనిపించారు. వీళ్లిద్ద‌రిపై ఓ ఫోటోషూట్ కూడా అక్క‌డే ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. వ‌చ్చిన త‌ర్వాత బోయ‌పాటి సినిమాతో చ‌ర‌ణ్.. త్రివిక్ర‌మ్ సినిమాతో ఎన్టీఆర్ బిజీ కానున్నారు. ఈ రెండు సినిమాలు ద‌స‌రా వ‌ర‌కు పూర్తి కానున్నాయి. ఈ మేర‌కు ఇప్ప‌టికే చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ల‌కు రాజ‌మౌళి నుంచి స్వీట్ అండ్ సాఫ్ట్ వార్నింగ్ కూడా వెళ్లింది. అక్టోబ‌ర్ లోపు మీ సినిమాలు పూర్తి చేసుకుని రావాల‌ని ఇప్ప‌టికే చెప్పేసాడు జ‌క్క‌న్న‌. దీన్నిబ‌ట్టే త‌మ ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నారు రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్. మొత్తానికి వ‌ర్క్ షాప్ మొద‌లైంది.. ఇక అక్టోబ‌ర్ నుంచి అస‌లు వ‌ర్క్ కూడా మొద‌లు కానుంద‌న్న‌మాట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here