అమ్మ‌మ్మ‌గారిల్లు.. అనుబంధాల లోగిళ్లు..


చిన్న‌పుడు సెల‌వుల్లో అమ్మ‌మ్మ‌గారింటికి వెళ్ల‌డం గుర్తుండే ఉంటుంది. అక్క‌డే ఉండి పండ‌గ సెల‌వులు ఎంజాయ్ చేస్తూ అంద‌రితో గ‌డిపిన రోజులు మ‌రిచిపోలేం క‌దా..! ఇప్పుడు ఇలాంటి క‌థ‌తోనే నాగ‌శౌర్య వ‌స్తున్నాడు. ఈయ‌న న‌టించిన సినిమా అమ్మ‌మ్మ‌గారిల్లు. సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌కుడు.
ఈ చిత్రం మే 25న విడుద‌ల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది. కొత్త‌గా అయితే లేదు కానీ అలాగ‌ని తీసిపారేసేంత‌గా మాత్రం లేదు. అస‌లే ఇప్పుడు శౌర్య టైమ్ బాగుంది. ఆ మ‌ధ్య వ‌చ్చిన ఛ‌లో బాగానే ఆడింది. క‌ణంకు న‌టుడిగా పేరొచ్చింది. ఇక ఇప్పుడు మ‌రోసారి అనుబంధాల లోగిళ్లు అంటూ అమ్మ‌మ్మ‌గారింటితో వ‌స్తున్నాడు.
పైగా దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత ఓయ్ భామ షామిలీ ఈ చిత్రంలో న‌టించింది. దాంతో అమ్మ‌మ్మ గారింటిపై ఓ క‌న్నేయాల్సిందే అనుకుంటున్నారు ప్రేక్ష‌కులు కూడా. ట్రైల‌ర్ కూడా ఆస‌క్తిక‌రంగానే ఉంది. మ‌రి నిజంగానే ఈ చిత్రంలో అంత‌గా చెప్పు కునేంత కంటెంట్ ఉందా అనేది మ‌రో రెండు రోజుల్లో తేలిపోనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here