అమ్మ వ‌చ్చింది.. బ‌న్నీ బ‌ల‌య్యాడు..


ప్ర‌తీసారి యావ‌రేజ్ టాక్ వ‌చ్చిన సినిమాల‌తోనే హిట్లు కొట్టాడు అల్లుఅర్జున్. ఆ టైమ్ కు మ‌నోడి అదృష్టం కూడా అలా ప‌నిచేసింది. స‌రైనోడు కానీ.. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి కానీ వ‌చ్చిన టైమ్ బాగుండి.. ఆ త‌ర్వాత సినిమాలేవీ లేక‌.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ్యాజిక్ చేసాయి. అయితే గ‌తేడాది వ‌చ్చిన డిజేతో తొలి షాక్ త‌గిలింది అల్లుఅర్జున్ కు.
ఈ చిత్రం యావ‌రేజ్ గానే ఆడింది కానీ హిట్ కాదు. కాక‌పోతే 70 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది కాబ‌ట్టి హిట్ అనే ఖాతాలోకి వేసేసారంతా. అయితే ఇప్పుడు మాత్రం ప‌ప్పులు ఉడికేలా క‌నిపించ‌డం లేదు. అల్లుఅర్జున్ తాజా సినిమా నా పేరు సూర్య క‌చ్చితంగా ఫ్లాప్ లిస్ట్ లోకి వెళ్లిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. తొలిరోజే ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వ‌చ్చింది. దాంతో రికార్డుల‌కు దూరంగా.. ఫ్లాప్ కు చేరువ‌గా వ‌సూళ్లు వ‌స్తున్నాయి.
ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు రోజుల్లో కేవ‌లం 43 కోట్ల షేర్ మాత్రమే వ‌చ్చింది. ఈ మ‌ధ్య కాలంలో ఓ స్టార్ హీరో సినిమాకు ఇంత త‌క్కువ ఓపెనింగ్స్ రావ‌డం ఇదే తొలిసారి. భ‌ర‌త్ అనే నేను.. రంగ‌స్థ‌లం 70.. 80 కోట్ల షేర్ తీసుకొస్తే నా పేరు సూర్య మాత్రం ఇంకా 40ల్లోనే ఉన్నాడు. రెండో వారంపై కొద్దో గొప్పో ఆశ‌ల‌తో ఉన్న సూర్య‌కు మ‌హాన‌టి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ చిత్రం క్లాసిక్ అంటుండ‌టంతో అంద‌రూ అటువైపు వెళ్తున్నారు.
దాంతో సూర్య‌కు తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు. పైగా ఇప్పుడు మెహ‌బూబా కూడా వ‌చ్చింది. ఈ చిత్రానికి కూడా టాక్ ప‌ర్లేదు. మొత్తానికి బ‌న్నీ అదృష్టం బాగోలేదు.. ఈ సారి మాత్రం మ‌నోడు క‌చ్చితంగా ఖాజా తినాల్సిందే. అందుకే నెక్ట్స్ సినిమాపై ఇప్ప‌ట్నుంచే గ్రౌండ్ వ‌ర్క్ బాగా గ‌ట్టిగా ప్రిపేర్ చేస్తున్నాడు అల్లు వార‌బ్బాయి.
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here