అయ్యారే.. ర‌కుల్ కూర‌లో కరివేపాకా..? 

అదేంటి అంత మాట అనేసారు అనుకుంటున్నారా..? ఏమో ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. ఇక్క‌డ టాప్ హీరోయిన్ గా ఉన్న ర‌కుల్.. బాలీవుడ్ లో మాత్రం సీన్ హీరోయిన్ అయిపోయింది. అంటే ఒక్క సీన్ లో క‌నిపించి మాయ‌మ‌య్యే కారెక్ట‌ర్ అన్న‌మాట‌. కొన్నేళ్లుగా బాలీవుడ్ కు వెళ్ల‌డ‌మే మ‌రిచిపోయింది ర‌కుల్. ఇక్క‌డే తెలుగు ఇండ‌స్ట్రీలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. పైగా గ్లామ‌ర్ షో లో కూడా పెద్ద‌గా హ‌ద్దులేవీ లేక‌పోవ‌డంతో ఈజీగానే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్ర‌స్తుతం త‌మిళ్ లో సూర్య‌తో సెల్వ రాఘ‌వ‌న్ సినిమాతో పాటు హిందీలో నీర‌జ్ పాండే అయ్యారీలో న‌టిస్తుంది. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. దేశ‌భ‌క్తి నేప‌థ్యంలోనే.. ఆర్మీ డిపార్ట్ మెంట్ లో జ‌రిగే అవినీతి నేప‌థ్యంలో తెర‌కె క్కిన సినిమా ఇది. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా.. మ‌నోజ్ బాయ్ పెయ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రంలో ర‌కుల్ హీరోయిన్. కానీ ట్రైల‌ర్ లో మాత్రం కేవ‌లం ఒక్క‌టంటే ఒకే సెక‌న్ ఇలా క‌నిపించి మాయ‌మైపోయింది ఈ ముద్దుగుమ్మ‌. అస‌లే లేక లేక చాలా ఏళ్ల త‌ర్వాత హిందీలో చేస్తున్న సినిమా.. ట్రైల‌ర్ లోనే ఇలా ఉంటుందా లేదంటే సినిమాలో కూడా ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయే పాత్రా అనేది చూడాలిక‌. జ‌న‌వ‌రి 26న అయ్యారీ విడుద‌ల కానుంది. అదే రోజు ప్యాడ్ మ్యాన్ కూడా రానుంది. రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు పోటీ ప‌డ‌బోతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here