అయ్యో అనుకు ఎంత క‌ష్ట‌మొచ్చిందో..!


అను ఎమ్మాన్యువ‌ల్.. మొన్న‌టి వ‌ర‌కు ఇండ‌స్ట్రీలో బాగా వినిపించిన పేరు ఇది. వ‌ర‌స‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోయిన ఈ భామ‌కు ఇప్పుడు ఉనికి కోల్పోయే ప‌రిస్థితికి వ‌చ్చింది. మెగా హ్యాండ్ ప‌డితే స్టార్ అవుతుందేమో అనుకుంటే.. అడ్ర‌స్ లేకుండా పోయేలా ఉంది ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు. మొన్న‌టికి మొన్న అజ్ఞాత‌వాసితో అమ్మాయి కెరీర్ అజ్ఞాతంలోకి వెళ్లినంత ప‌నైంది. ఇక ఆశ‌లు పెట్టుకున్న ఆక్సీజ‌న్ కొంప ముంచేసింది. వ‌ర‌స‌గా రెండు భారీ డిజాస్ట‌ర్లు ప‌డేస‌రికి ఇప్పుడు ఈమె ఆశ‌ల‌న్నీ నా పేరు సూర్య‌పైనే ఉన్నాయి. బ‌న్నీ లాంటి స్టార్ హీరో సినిమా కావ‌డంతో ఈ భామ ఆశ‌ల‌న్నీ ఇప్పుడు ఈ చిత్రంపైనే ఉన్నాయి. కానీ ఇందులోనూ ఇప్పుడు అనుకు షాక్ త‌ప్పేలా లేదు. సినిమాలో రొమాన్స్ ఎక్కువైపోయింద‌ని.. అలా ఉంటే క‌థ‌కే దెబ్బ ప‌డుతుంద‌ని ఇందులో చాలా వ‌ర‌కు అను ఎమ్మాన్యువ‌ల్ సీన్స్ క‌ట్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు వ‌క్కంతం వంశీ. దానికి బ‌న్నీ కూడా ఫుల్ స‌పోర్ట్ ఇస్తున్నాడు. సినిమా ఫ్లో దెబ్బ‌తినేది ఏదీ ఉండ‌టానికి అవ‌స‌రం లేద‌ని చెబుతున్నాడు మెగా హీరో.
నా పేరు సూర్య‌లో దాదాపు 20 నిమిషాల సీన్స్ ఎగిరిపోతున్నాయ‌ని తెలుస్తుంది. ఫ‌స్టాఫ్ లోనే చాలా వ‌ర‌కు సీన్స్ తీస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అందాల ఆర‌బోత‌కు ఎలాంటి అడ్డంకులు లేక‌పోవ‌డంతో అను ఎమ్మాన్యువ‌ల్ కు ఫ్లాపులు ఉన్నా కూడా నువ్వే అర‌కొర అవ‌కాశాలు వ‌స్తున్నాయి. నా పేరు సూర్య‌లో న‌టిస్తున్న అను.. నాగ‌చైత‌న్య‌తో మారుతి తెర‌కెక్కిస్తోన్న శైల‌జారెడ్డి అల్లుడు సినిమాలో ఎంపికైంది. ఈ చిత్రంలో అనుకు అవ‌కాశం రావ‌డానికి కార‌ణం త్రివిక్ర‌మ్ అని తెలుస్తుంది. అజ్ఞాత‌వాసి టైమ్ లోనే అను వ‌ర్క్ మెచ్చిన మాట‌ల మాంత్రికుడు.. వ‌ర‌స‌గా అవ‌కాశాలిస్తున్నాడు. వీటన్నింటికీ నిర్మాత రాధాకృష్ణ కావ‌డంతో ప‌ని సులువైపోయింది. మొత్తానికి ఇప్పుడు నాగ‌చైత‌న్య‌.. బ‌న్నీ సినిమాలు ఆడితే కానీ అనుకు మంచి రోజులు రాన‌ట్లే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here