అయ్యో మ‌ళ్లీ వెళ్లావా మ‌హేశా..?


ఒక‌ప్పుడు హీరోల‌కు ముందు సినిమాలు.. ఆ త‌ర్వాత కుటుంబాలు. అందుకే అప్ప‌ట్లో నెల‌ల త‌ర‌బ‌డి షూటింగ్స్ లోనే ఉన‌ండేవారు హీరోలు. ఈ త‌రం వార‌సుల‌ను అడిగితే అందుకే చిన్న‌పుడు మా నాన్న‌తో ఎక్కువ‌గా ఆడుకోలేక‌పోయాం అంటూ చెప్తారు. కృష్ణ గానీ.. చిరంజీవి కానీ.. ఎన్టీఆర్ కానీ..
హీరో ఎవ‌రైనా ఆ రోజుల్లో ముందు సినిమాల‌కు ఎక్కువ‌గా ప్రాధాన్యత ఇచ్చేవారు. అందుకే వాళ్లంతా బెస్ట్ హీరోల‌య్యారు కానీ బెస్ట్ ఫ్యామిలీ ప‌ర్స‌న్స్ మాత్రం కాలేక‌పోయారు. కానీ ఇప్పుడు హీరోలు మాత్రం అలా కాదు. వాళ్లు బెస్ట్ హీరోలు.. అలాగే ప‌క్కా ఫ్యామిలీ ప‌ర్స‌న్స్ కూడా. ఈ లిస్ట్ లో అంద‌రికంటే ముందు వ‌చ్చే హీరో మ‌హేశ్ బాబు. ఎందుకంటే ఈయ‌న‌కు ఏ మాత్రం షూటింగ్ లో టైమ్ దొరికినా వెంట‌నే కుటుంబాన్ని తీసుకుని విదేశాల‌కు వెళ్లిపోతాడు.
దొర‌క్క‌పోయినా దొరికించుకుని మ‌రీ వెళ్తుంటాడు. మొన్నటికి మొన్న భ‌ర‌త్ విడుద‌లకు ముందు టూర్ వెళ్లొచ్చాడు ఈ హీరో. మ‌ళ్లీ ఇప్పుడు విడుద‌లైన త‌ర్వాత ఇంకో టూర్ వెళ్లాడు. ప్ర‌స్తుతం ఈయ‌న పారిస్ లో ఉన్నాడు. ఫారెన్ లో ఫ్యామిలీతో ఈయ‌న ఎంజాయ్ చేసిన ఫోటోలు చూస్తుంటే మ‌హేశ్ ఎంత చిన్న పిల్లాడో అర్థ‌మైపోతుంది. వ‌య‌సు 40 దాటినా ఇప్ప‌టికీ మ‌హేశ్ మాత్రం కుర్రాడే. టూర్ పూర్త‌య్యాక వంశీ పైడిప‌ల్లి సినిమా సెట్ లో అడుగుపెట్ట‌నున్నాడు. ఇదే ఏడాది షూటింగ్ పూర్తి చేయ‌బోతున్నాడు ద‌ర్శ‌కుడు. ఇది పూర్తైన వెంట‌నే సుకుమార్ క‌థ ప‌ట్టుకుని రెడీగా ఉంటాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here