అర్జున్ రెడ్డితో రామ్ చ‌ర‌ణ్.. నిజ‌మేనా..?


అర్జున్ రెడ్డి సినిమా చూసి అంతా ఒక‌టే మాట అనుకున్నారు.. ఎవ‌ర్రా ఈ డైరెక్ట‌ర్.. ఇలా తీసాడు.. అస‌లు ఈయ‌న తొలి సినిమా ఇదేనా.. మెంట‌ల్ ఎక్కించేసాడ్రా బాబూ..! ఇదిగో ఇలాంటి క‌మెంట్సే వినిపించాయి అర్జున్ రెడ్డి సినిమా త‌ర్వాత‌. ఓ ర‌కంగా మూస‌లో ఉన్న ఇండ‌స్ట్రీకి పాత్ బ్రేకింగ్ మూవీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా.
ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడి రెండో సినిమాపై ఇండ‌స్ట్రీలో కావాల్సిన‌న్ని వార్త‌లు వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డితో మ‌హేశ్ సినిమా చేయ‌బోతున్నాడ‌నే టాక్ వినిపిస్తుంది. విన‌డానికి కాస్త వింత‌గా ఉంది క‌దా.. కానీ ఇదే నిజ‌మ‌య్యే అవ‌కాశం కూడా లేక‌పోలేదు. మ‌హేశ్ కోసం సందీప్ ను ఓ క‌థ కూడా సిద్ధం చేయాలంటూ న‌మ్ర‌త కోరింది. అర్జున్ రెడ్డితో రాత్రికి రాత్రే స్టార్ డైరెక్ట‌ర్ అయిపోయాడు సందీప్ రెడ్డి. తీసింది అడ‌ల్ట్ కంటెంట్ సినిమానే అయినా.. దాన్నే ట్రెండీగా తెర‌కెక్కించాడు ఈ ద‌ర్శ‌కుడు.
దాంతో మ‌నోడు తీసిన బోల్డ్ సినిమాకు అంతా బెండ్ అయిపోతున్నారు. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ కూడా సందీప్ రెడ్డితో సినిమా చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.
దీనికి సాక్ష్యం కూడా లేక‌పోలేదు. మెగా ఫ్యామిలీతో బాగా క‌లిసిపోతున్నాడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడు. ఆ మ‌ధ్య చ‌ర‌ణ్ ఇంట్లో జ‌రిగిన వేడుక‌కు ఎన్టీఆర్ తో పాటు వ‌చ్చిన సందీప్.. ఇప్పుడు రంగ‌స్థ‌లం స‌క్సెస్ మీట్ లో క‌నిపించాడు. అక్క‌డ వంశీ పైడిప‌ల్లి త‌ప్ప మ‌రో బ‌య‌టి ద‌ర్శ‌కుడు లేడు. అలాంటి చోట సందీప్ క‌నిపించాడంటే తెర‌వెన‌క ఏదో జ‌రుగుతుంది.
పైగా ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ ఛాలెంజింగ్ క‌థ‌ల వైపు బాగా అడుగేస్తున్నాడు. దాంతో ఈ కాంబినేష‌న్ కొట్టిపారేయ‌లేం. ప్ర‌స్తుతం బోయ‌పాటి.. ఆ త‌ర్వాత రాజ‌మౌళి.. వెంట‌నే కొర‌టాల‌.. ఆ త‌ర్వాత సందీప్ రెడ్డి ఇలా ద‌ర్శ‌కుల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా క‌నిపిస్తున్నాడు మెగా వార‌సుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here