అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌.. ఎలా ఉన్నాడు..?


ఎన్టీఆర్ కొత్త సినిమా పోస్ట‌ర్ విడుద‌లైంది. ఊహించిన దానికంటే భిన్నంగా పోస్ట‌ర్ విడుద‌ల చేసాడు త్రివిక్ర‌మ్. ఈయ‌న సినిమా అంటే ఏదో ఫ్యామిలీ అంతా కూర్చుని.. న‌వ్వుతూ ఎన్టీఆర్ అలా ఎదురొస్తాడేమో అనుకుంటే ప‌క్కా మాస్ పోస్ట‌ర్ విడుద‌ల చేసి కిరాక్ పుట్టించాడు త్రివిక్ర‌మ్.
అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ అంటూ టైటిల్ కూడా చాలా కొత్త‌గా పెట్టాడు త్రివిక్ర‌మ్. టైటిల్ నే కావాల్సినంత ఫ్యాక్ష‌న్ క‌నిపిస్తుంది. అయితే అభిమానుల‌కు ఈ పోస్ట‌ర్ ఓకే.. లుక్ ఓకే కానీ సాధారణ ప్రేక్ష‌కుల‌కు మాత్రం ఎందుకో ఎక్క‌డో తేడా కొడుతుంది. పైగా ఫాంట్ కూడా అజ్ఞాతవాసి మాదిరే ఉండ‌టం.. సిక్స్ ప్యాక్ లో ఎన్టీఆర్ కాస్త కొత్త‌గా ఉన్నా కూడా ఎందుకో టెంప‌ర్ లో క‌నిపించినంత ఫ్రెష్ లుక్ ఇందులో లేదు.
టైటిల్ కు కూడా కొంద‌రు ఓకే అంటుంటే.. మ‌రికొంద‌రు నాట్ ఓకే అంటున్నారు. మొత్తానికి అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ ఫ్యాక్ష‌న్ క‌థ అని తెలుస్తుంది కాబ‌ట్టి ఇక ట్రీట్ మెంట్ తోనే త్రివిక్ర‌మ్ మాయ చేయాలి. అక్టోబ‌ర్ లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here