అల్లుడు హ్యాండిచ్చాడు.. అందుకే ఒక్క‌డున్నాడు..!

Gopichand Pantham
ఈ రోజుల్లో ఫ్లాప్ డైరెక్ట‌ర్ ల‌ను న‌మ్మ‌డం అంటే అంత ఈజీ కాదు. క‌థ మ‌రీ న‌చ్చితే రిస్క్ తీసుకుంటారేమో కానీ.. తాము కూడా ఫ్లాపుల్లో ఉన్న‌పుడు హీరోలు మాత్రం ఫ్లాప్ డైరెక్ట‌ర్ల వైపు వెళ్ల‌రు. అందుకే కొంద‌రు ద‌ర్శ‌కుల‌కు టాలెంట్ ఉన్నా కూడా అవ‌కాశాల కోసం తిరిగేస్తుంటారు. ఇప్పుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ప‌రిస్థితి కూడా ఇంతే. ఈయ‌న అన్నీ మంచి సినిమాలే చేస్తాడు. కానీ అవి క‌మ‌ర్షియ‌ల్ గా మాత్రం విజ‌యం సాధించ‌వు. ఈయ‌న గ‌త సినిమా మ‌న‌మంతాకు కూడా అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది కానీ ఆడ‌లేదు. దాంతో యేలేటితో సినిమా చేయ‌డానికి స్టార్ హీరోలు ముందుకు రారు.. చిన్న హీరోలు ఆలోచిస్తారు. సాయిధ‌రంతేజ్ తో ఈయ‌న ఓ సినిమాకు క‌మిటైనా కూడా ఇప్పుడు అది ఆగిపోయింది. ఆ ప్లేస్ లోకి గోపీచంద్ వ‌చ్చాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో చంద్ర‌శేఖ‌ర్ యేలేటితో ఒక్క‌డున్నాడు.. సాహ‌సం సినిమాలు చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ రెండూ క‌మ‌ర్షియ‌ల్ గా ఆడ‌లేదు కానీ గోపీచంద్ కు న‌టుడిగా మంచి పేరు తీసుకొచ్చాయి. మ‌రి హ్యాట్రిక్ కాంబినేష‌న్ సెట్ అవుతుంది. మ‌రి ఈ సారైనా గోపీచంద్ కు కోరుకున్న విజ‌యం ఈ ద‌ర్శ‌కుడు ఇస్తాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here