అవసరం, సమయం రాజకీయ నాయకులని ఎంతటికైనా మార్చేస్తుంది:ఆర్జీవి


రాజకీయాల్లో ఎపుడు ఎం మార్పులు వస్తాయో ఎవరికి తెలీదు. పవన్ కళ్యాణ్ కుడా తెలంగాణ రాయకీయలో మార్పులకి కారణం అయ్యేల ఉన్నారు. న్యూ ఇయర్ శుభాకాంక్షలు పేరుతో పవన్ కళ్యాణ్ కెసిఆర్ ని కలిశారు. వాళ్లు ఎందుకు కలిశారు అని ప్రజలు ఫాన్స్ ఆలోచనలో ఉంటె, ఆర్జీవీ మాత్రం తనదైన శైలిలో చురకలు అంటించారు. పవన్ కల్యాణ్ గతంలో ఓ వేదికపై ప్రసంగిస్తూ.. అన్నమాటలని, అలాగే పవన్ పై కేసీఆర్ ఓ బహిరంగ సభలో పేల్చిన పంచులను గుర్తు చేస్తూ…
పవన్ కల్యాణ్: ఏయ్.. కేసీఆర్ నీ తాట తీస్తా..!!!
కేసీఆర్: ఆడి పేరేందిరా బై.. ???
అవసరం, సమయం రాజకీయ నాయకులని ఎంతటికైనా మార్చేస్తుంది. జై రాజకీయ నాయకుల్లారా! అంటూ కేసీఆర్‌కి పవన్ శుభాకాంక్షలు తెలుపుతున్న ఫొటోని పోస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here