అవేంజ‌ర్స్ దెబ్బ‌కు అన్నీ ఔట్..


అనుకున్న‌దే.. అవేంజ‌ర్స్ వ‌స్తే క‌చ్చితంగా మ‌న సినిమాల‌కు ఆ ముప్పు త‌ప్ప‌ద‌ని అంతా అనుకున్నారు. కానీ సునామీ ఉధృతి మ‌రీ ఇంత‌లా ఉంటుంద‌ని మాత్రం ఊహించ‌లేదు. అస‌లు అవేంజ‌ర్స్ దెబ్బ‌కు ఇండియ‌న్ బాక్సాఫీస్ మొత్తం కుదేలైపోతుంది. ఈ చిత్రం దెబ్బ‌కు రికార్డుల‌న్నీ తుడిచిపెట్టుకుపోతున్నాయి.
తొలిరోజే ఇండియాలో 40 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి ఆల్ టైమ్ రికార్డులు సెట్ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ హాలీవుడ్ సినిమాకు కూడా ఈ స్థాయి ఓపెనింగ్స్ రాలేదు. కొన్నేళ్ల‌లో అవ‌తార్.. 2012.. ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ 7.. జురాసిక్ వ‌ర‌ల్డ్.. జంగిల్ బుక్ లాంటి హాలీవుడ్ సినిమాలు ఇండియాలోనూ క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించాయి. ఇప్పుడు అవేంజ‌ర్స్ ఇన్ఫినిటీ వార్ కూడా ఇదే చేస్తుంది. ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ చూస్తుంటే మెంట‌ల్ వ‌చ్చేస్తుంది.
ఎప్రిల్ 27న సినిమా విడుదలంటే.. వారం రోజుల ముందే అన్ని మ‌ల్టీప్లెక్సుల్లో టికెట్స్ అమ్ముడైపోయాయి. వారం రోజుల వ‌ర‌కు టికెట్స్ లేవు. అవేంజ‌ర్స్ దెబ్బ‌కు భ‌ర‌త్ అనే నేను క‌లెక్ష‌న్లకు భారీ గండి ప‌డ‌టం ఖాయంగా క‌నిపిస్తుంది. మొత్తానికి ఈ చిత్రం అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ సునామీ సృష్టిస్తూ.. అంద‌రినీ దెబ్బ కొడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here