ఆచారి న‌వ్వులు గ్యారెంటీనా..?

Achari America Yatra
మంచు విష్ణుకు ఇప్పుడు అర్జంట్ గా ఓ హిట్ ప‌డాలి. చాలా కాలంగా ఈయ‌న‌కు స‌రైన విజ‌యం లేదు. ఒక్క సినిమా కూడా ఆడ‌టం లేదు. వ‌చ్చిన సినిమా వ‌చ్చిన‌ట్లు వెళ్లిపోతుంది కానీ నిల‌బ‌డింది మాత్రం లేదు. ఈ స‌మ‌యంలో క‌చ్చితంగా త‌న సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని భావ‌న‌లో ఉన్నాడు విష్ణు.
అదే న‌వ్వుల యాత్ర‌. అదేనండీ ఆచారి అమెరికా యాత్ర. విష్ణు హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం ఎప్పుడో జ‌న‌వ‌రిలోనే విడుద‌ల కావాల్సి ఉంది. కానీ అనివార్య కార‌ణాల‌తో వాయిదా ప‌డుతూ వ‌స్తుంది. ఎప్రిల్ 27న క‌ణంతో క‌లిసి వ‌స్తుంది ఈ చిత్రం. ట్రైల‌ర్ చూస్తుంటే సినిమా పూర్తి స్థాయి కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ అని అర్థ‌మైపోతుంది.
జి నాగేశ్వ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు కాబ‌ట్టి ఆ క్లారిటీ కూడా ఉంటుంది. ఇక ఇందులో విష్ణుకు బాగా క‌లిసొచ్చిన బ్ర‌హ్మానందం ఆచారి పాత్ర‌లో న‌టించాడు. ఆయ‌న్ని న‌మ్మించి అమెరికా తీసుకెళ్లి.. అక్క‌డ ఎలాంటి తిప్ప‌లు పెట్టార‌నేది అస‌లు క‌థ‌. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో బ్ర‌హ్మానందం కెరీర్ మ‌ళ్లీ గాడిన ప‌డాలంటే ఏదైనా అద్భుతం జ‌రగాల్సిందే..!
ఆ అద్భుతం ఇదే అవుతుంద‌ని ఆశిస్తున్నాడు బ్ర‌హ్మి. దేనికైనా రెడీ కూడా బ్రాహ్మ‌ణ క‌థ‌తోనే వ‌చ్చింది. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు విష్ణు. మ‌రి చూడాలిక‌.. అప్పుడు క‌లిసొచ్చిన‌ట్లు కూడా ఇప్పుడు కూడా క‌లిసొస్తుందేమో..? మ‌రి చూడాలిక‌.. విష్ణును ఆచారి అయినా ఫామ్ లోకి తీసుకొస్తాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here