ఆచారి న‌వ్వుల యాత్ర బాగానే ఉందిగా..

‘Achari America Yatra’ To Hit Screens On January 26th, 2018
న‌వ్వించ‌డం యోగం.. న‌వ్వ‌లేక‌పోవ‌డం రోగం అంటారు. అందుకే కామెడీ సినిమాల‌కు ఎప్పుడూ ఆద‌ర‌ణ త‌గ్గ‌దు. ఎన్ని వ‌చ్చినా.. ఎన్నిసార్లు వ‌చ్చినా కూడా కామెడీ ఉందంటే చాలు సినిమాలు హిట్ అయిపోతుంటాయి. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు విష్ణు. ఈయ‌న న‌టించిన ఆచారి అమెరికా యాత్ర విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ చూస్తుంటే సినిమా ఎంత కామెడీగా ఉండ‌బోతుందో అర్థ‌మైపోతుంది. తెలిసిన క‌థే అయినా కూడా క‌డుపులు చెక్క‌ల‌య్యే కామెడీ క‌న్ఫ‌ర్మ్ అని తెలిసిపోతుంది. జి నాగేశ్వ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందింది.
ఆడోర‌కం ఈడోర‌కం.. దేనికైనా రెడీ లాంటి హిట్స్ త‌ర్వాత విష్ణుతో నాగేశ్వ‌ర‌రెడ్డి చేసిన సినిమా ఇది. ఇందులో బ్ర‌హ్మానందం ఆచారి పాత్ర‌లో న‌టించాడు. ఆయ‌న్ని న‌మ్మించి అమె రికా తీసుకెళ్లి.. అక్క‌డ ఎలాంటి తిప్ప‌లు పెట్టార‌నేది అస‌లు క‌థ‌. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో బ్ర‌హ్మానందం కెరీర్ మ‌ళ్లీ గాడిన ప‌డాలంటే ఏదైనా అద్భుతం జ‌రగాల్సిందే..! ఆ అద్భుతం ఇదే అవుతుంద‌ని ఆశిస్తున్నాడు బ్ర‌హ్మి. దేనికైనా రెడీ కూడా బ్రాహ్మ‌ణ క‌థ‌తోనే వ‌చ్చింది. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు విష్ణు. మ‌రి చూడాలిక‌.. అప్పుడు క‌లిసొచ్చిన‌ట్లు కూడా ఇప్పుడు కూడా క‌లిసొస్తుందేమో..? జ‌న‌వ‌రి 26న అనుష్క భాగ‌మ‌తితో క‌లిసి పోటీ ప‌డ‌బోతున్నాడు ఈ హీరో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here