ఆఫీస‌ర్ ఫ‌స్ట్ టాక్ ఏంటి..?


ఆఫీస‌ర్ సినిమా భారీ అంచ‌నాలు కాదు కానీ ప‌ర్లేద‌నే అంచ‌నాల‌తోనే వ‌స్తుంది. వ‌ర్మ ద‌ర్శ‌కుడు కావ‌డంతో ఇదివ‌ర‌కు ఆస‌క్తి అయితే ప్రేక్ష‌కుల్లో క‌నిపించ‌డం లేదు. నాగార్జున ఏదో నిజాయితీ చూసాన‌ని చెప్పాడు కానీ ఇప్పుడు వినిపిస్తున్న ఫ‌స్ట్ టాక్ ప్ర‌కారం అయితే అలాంటి నిజాయితీ ఏదీ సినిమాలో లేదంటున్నారు ప్రేక్ష‌కులు. ఓవ‌ర్సీస్ లో ఈ చిత్రానికి ఊహించిన‌ట్లుగానే టాక్ అంత బాగా రాలేదు.
పైగా నాగార్జున ఇచ్చిన అవకాశం వ‌ర్మ వేస్ట్ చేసుకున్నాడంటూ విమ‌ర్శ‌లు కూడా చేస్తున్నారు అక్క‌డి ప్రేక్ష‌కులు. అన్నింటికీ మించి ఇలాంటి స‌మ‌యంలో వ‌ర్మ‌ను ఎందుకు నాగ్ న‌మ్మాడు అంటూ ఆయ‌న్ని కూడా తిట్టుకుంటున్నారు అభిమానులు. ఆఫీస‌ర్ లో కూడా వ‌ర్మ ఏమీ మార‌లేద‌ని.. అవే త‌న‌కు మాత్ర‌మే తెలిసి.. ప్రేక్ష‌కుల‌కు అర్థం కాని కెమెరా యాంగిల్స్ తో అంద‌ర్నీ మెంట‌ల్ ఎక్కించాడ‌ని తెలుస్తుంది.
ఈ చిత్రం కూడా నాగార్జున అంచ‌నాలు నిల‌బెట్ట‌న‌ట్లే అని డిసైడ్ అయిపోవ‌చ్చు. అర్థం ప‌ర్థం లేని క‌థ‌తో వ‌ర్మ మ‌రోసారి అడ్డంగా బుక్ అయిపోయాడ‌ని తెలుస్తుంది. మ‌రి చూడాలిక‌.. ఓవ‌ర్సీస్ టాక్ ఇలా ఉంటే మ‌న ద‌గ్గ‌ర ఇంకెలా ఉంటుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here