ఆయ‌న ఇక్క‌డే సెటిల‌య్యేలా ఉన్నాడు..

Neil Nitin Mukesh
బాలీవుడ్ లో క‌త్రినాకైఫ్ లాంటి స్టార్ హీరోయిన్ తో రొమాన్స్ చేసిన హీరో అత‌డు.. ఆ త‌ర్వాత కూడా కొన్ని సినిమాల్లో హీరోగా న‌టించాడు.. కానీ ఏం చేస్తాం ఇప్పుడు టైమ్ బ్యాడ్ అందుకే ద‌క్షిణాదిన విల‌న్ రోల్స్ చేసుకుంటున్నాడు. అత‌డే నీల్ నితిన్ ముఖేష్. బాలీవుడ్ లోకి న్యూయార్క్ లాంటి సంచ‌ల‌న సినిమాతో అడుగుపెట్టాడు. కానీ త‌ర్వాత అదే టెంపో కొన‌సాగించ‌లేక‌పోయాడు ఈ హీరో. క‌త్తి సినిమాతో ఈయ‌న కెరీర్ మారింది. ఈ సినిమాలో విల‌న్ గా మెప్పించిన నీల్ నితిన్ కు ఇప్పుడు సాహోలో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. ఇందులో ప్ర‌భాస్ కు ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. సాహో పూర్తి కాక‌ముందే మ‌రో సినిమాలో విల‌న్ ఆఫ‌ర్ అందుకున్నాడు నీల్ నితిన్.
బెల్లంకొండ శ్రీ‌నివాస్ సినిమాలో విల‌న్ గా న‌టించ‌బోతున్నాడు నీల్ నితిన్. ఈయ‌న ప్ర‌స్తుతం శ్రీ‌నివాస్‌ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వంశధార బ్యానర్‌పై ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ చిత్ర ఓపెనింగ్ ఈ మ‌ధ్యే జ‌రిగింది. ఇందులో కాజ‌ల్ హీరోయిన్ గా న‌టించే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ చిత్రంలో నీల్ నితిన్ ను విల‌న్ గా తీసుకుంటున్నారు. బెల్లంకొండ ప్ర‌స్తుతం సాక్ష్యం సినిమాలో న‌టిస్తున్నాడు. శ్రీ‌వాస్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం మే 11న విడుద‌ల కానుంది. ఇక ఇది పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో ఉండ‌గానే మ‌రో సినిమా ప‌ట్టాలెక్కిస్తున్నాడు బెల్లంకొండ‌. మ‌రి నీల్ నితిన్ తో బెల్లంకొండ వార్ ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here