ఆర్ఆర్ఆర్.. వ‌చ్చేసిందిగా..!

  RRR
ఏంటీ ఆర్ఆర్ఆర్ అనుకుంటున్నారా..? ఇన్నాళ్లూ అభిమానులు వేచి చూస్తున్న అనౌన్స్ మెంట్.. క‌ల‌లు కంటోన్న సినిమా ప్ర‌క‌ట‌న‌.. తెలుగు ఇండ‌స్ట్రీ రూపురేఖ‌ల్ని మార్చేసే సినిమాకు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ వ‌చ్చేసింది. అదే రాజ‌మౌళి-రామ్ చ‌ర‌ణ్-రామారావు కాంబినేష‌న్. అదే ట్రిపుల్ ఆర్. ఇన్నాళ్లూ ఈ సినిమా ఉంటుంద‌ని తెలుసు కానీ.. అఫీషియ‌ల్ గా మాత్రం ఎవ‌రూ చెప్ప‌లేదు. కానీ ఇప్పుడు అది వ‌చ్చేసింది. రాజ‌మౌళి నెక్ట్స్ సినిమాపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. మార్చ్ 22 సాయంత్రం హ‌డావిడి లేకుండా ఈ చిత్రం గురించి ప్ర‌క‌ట‌న ఇచ్చేసాడు రాజ‌మౌళి. అక్టోబ‌ర్ నుంచి సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. ఆ లోపు త్రివిక్ర‌మ్-ఎన్టీఆర్.. బోయ‌పాటి-రామ్ చ‌ర‌ణ్ సినిమాలు కూడా పూర్తి కానున్నాయి. ఒక్క‌సారి ప‌ట్టాలెక్కిన త‌ర్వాత నాన్ స్టాప్ షూటింగ్ చేయ‌బోతున్నాడు రాజ‌మౌళి. 2019లో ఈ చిత్రం వ‌స్తుంద‌నే ఆశ‌లు ఉన్నా కూడా ఎందుకో కానీ 2020 వ‌ర‌కు రాద‌నే సంకేతాలు కూడా ఉన్నాయి. ఇందులో కూడా గ్రాఫిక్స్ బాగానే వాడుకోబోతున్నాడు రాజ‌మౌళి. మ‌రీ బాహుబ‌లి రేంజ్ లో కాదు కానీ ఈగ స్థాయిలో ఇందులో విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఉండ‌బోతున్నాయని తెలుస్తుంది. మొత్తానికి చూడాలిక‌.. టాలీవుడ్ ని మార్చేసే ఈ మ‌ల్టీస్టార‌ర్ ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here