ఇంకా 100 రోజులేంటి బాల‌య్య గారు..?


ఈ రోజుల్లో 100 రోజుల వేడుక అంటే ప్రేక్ష‌కులు న‌వ్వుతారు. అస‌లు న‌వ్వ‌డం మాట అటుంచితే అలాంటి ఆలోచ‌న వ‌చ్చినా కూడా విచిత్రంగా చూసి మ‌రోసారి న‌వ్వుతారు. అందుకే 100 రోజుల వేడుక అనే మాట ఇండ‌స్ట్రీలో కొన్నేళ్ల కిందే బ్యాన్ చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇప్పుడంతా రెండు మూడు వారాల సినిమాలే.
క‌నీసం 50 రోజుల వేడుక జ‌ర‌పాల‌న్నా కూడా ఆలోచిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో బాల‌య్య మాత్రం ఇంకా పాత ప‌ద్ద‌తుల్లోనే ఉన్నాడు. ఈయ‌న త‌న జై సింహా సినిమాకు 100 రోజుల వేడుక చేసుకున్నాడు. అది కూడా గుంటూరు జిల్లాలో. సంక్రాంతికి వ‌చ్చిన ఈ చిత్రం బాగానే ఆడింది.
అజ్ఞాత‌వాసి అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డంతో మ‌రో ఆప్ష‌న్ లేక ప్రేక్ష‌కులు కూడా బాల‌య్య సినిమానే ఆద‌రించారు. సినిమా మ‌రీ బ్లాక్ బ‌స్ట‌ర్ ఏం కాదు కానీ జ‌స్ట్ హిట్ అనిపించుకుని బ‌య‌ట‌ప‌డింది. కేఎస్ ర‌వికుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో న‌య‌న‌తార హీరోయిన్ గా న‌టించ‌డం విశేషం. ఇప్పుడు ఈ చిత్రానికి వంద రోజుల వేడుక జ‌రిగింది.
పైగా ఈ చిత్రం నాలుగు సెంట‌ర్ల‌లో 100 రోజులు ఆడిందంటూ పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌డం కూడా కామెడీగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో ఇంకా 100 రోజుల సినిమాలు ఎక్క‌డున్నాయి బాల‌య్య గారు అని అడుగుతున్నారు ప్రేక్ష‌కులు. మొత్తానికి ఎవ‌రేం అనుకున్నా.. తాను అనుకున్న‌దే చేసాడు బాల‌య్య‌. అప్ప‌ట్లో లెజెండ్ 1000 రోజుల వేడుక అన్న‌ట్లుగా ఇప్పుడు జై సింహా 100 రోజుల వేడుక జ‌రిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here