ఇది అందాల క‌ద‌న‌.. రంగం..

రంగం.. ఈ సినిమా గుర్తున్న వాళ్ల‌కు పియా బాజ్ పెయ్ కూడా బాగానే గుర్తుండి ఉంటుంది. కేవీ ఆనంద్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో పియా గ్లామ‌ర్ పిచ్చెక్కించింది. త‌న కారెక్ట‌ర్ కు కూడా మంచి పేరే వ‌చ్చింది. కానీ ఏం చేస్తాం.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఆ స్థాయి విజ‌యం లేదు ఈ భామ‌కు. అందుకే ఏం చేయాలో తెలియ‌క అందాల‌నే ఆర‌బోస్తూ కాలం వెల్ల‌దీస్తుంది. అయినా ఈ ఇండ‌స్ట్రీలో ఫేమ్ వ‌చ్చేంత వ‌ర‌కు ఓ తిప్ప‌లు..

వ‌చ్చిన త‌ర్వాత దాన్ని కాపాడుకోడానికి మ‌రో తిప్ప‌లు. ఇప్పుడు చాలా మంది హీరోయిన్ల‌కు ఇదే బాధ‌లు పాపం. అప్ప‌ట్లో రంగం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి చేరువైన బ్యూటీ పియా బాజ్ పెయి గుర్తుందా..? ఈ భామ ఆ త‌ర్వాత తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసినా ఎవ్వ‌రూ పెద్ద‌గా గుర్తు పెట్టుకోలేదు అది వేరే విష‌యం.
కానీ అవ‌కాశాలు రావ‌ట్లేదు క‌దా అని ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది..? అందుకే అందాల ఆర‌బోత‌తో తాను ఒక‌దాన్ని ఉన్నాన‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లకు తెలిసేలా చేస్తుంది పియా. అస‌లు మ‌నం చూస్తున్న‌ది టాలీవుడ్ హీరోయిన్ నా.. లేదంటే హాలీవుడ్ ఇంపోర్ట్ భామనా అనే రేంజ్ లో అందాలు ఆర‌బోసి కెమెరాల‌కు అరువిస్తుంది పియా బాజ్ పెయ్.
ఈ భామ పుట్టిస్తోన్న సెగ‌లు చూస్తుంటే థ‌ర్మామీట‌ర్లు కూడా పేలిపోయేలా క‌నిపిస్తున్నాయి. ఇంత చేస్తోన్నా పియాకు మాత్రం అవ‌క‌శాలు రావ‌ట్లేదు అదేం విచిత్ర‌మో మ‌రి..! ఈ మ‌ధ్యే ఓ బాలీవుడ్ సినిమాలో న‌టించినా అది వ‌చ్చి వెళ్లిన‌ట్లు కూడా ఎవ‌రికీ తెలియ‌దు..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here