ఇది రికార్డుల‌కు రంగ‌స్థ‌లం.. 

Rangasthalam teaser
అవును.. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. రంగ‌స్థ‌లం టీజ‌ర్ విడుద‌లైనప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియాలో రికార్డుల ర‌చ్చ మొద‌లైంది. రామ్ చ‌ర‌ణ్ గ‌త సినిమాలేవీ సృష్టించ‌ని రికార్డులు ఇప్పుడు రంగ‌స్థ‌లం టీజ‌ర్ సృష్టిస్తుంది. విడుద‌లైన 50 నిమిషాల్లోనే మిలియ‌న్ వ్యూస్ అందుకుంది రంగ‌స్థ‌లం టీజ‌ర్. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు.. రామ్ చ‌ర‌ణ్ ధైర్యానికి నిద‌ర్శ‌నంగా నిలిచింది రంగ‌స్థ‌లం. ఈ మ‌ధ్య కాలంలో ఇంత కొత్త‌ద‌నం ఉన్న టీజ‌ర్ మాత్రం ఎవ‌రూ చూసుండ‌రు. పైగా ఓ స్టార్ హీరో చెవుడు పాత్ర‌లో న‌టించ‌డం ఇదే తొలిసారి కూడా. అలాంటి ధైర్యం రామ్ చ‌ర‌ణ్ చేసాడు. పైగా టీజ‌ర్ లాస్ట్ షాట్ మాత్రం అదిరిపోయింది. క‌త్తి ప‌ట్టుకుని అలా న‌డుచుకుంటూ వ‌స్తున్న చ‌ర‌ణ్ ను చూసి ఫిదా కానివారంటూ ఉండ‌రు. ఇప్ప‌టికే ఈ టీజ‌ర్ రికార్డులు ఊహకంద‌ని రేంజ్ లో ఉన్నాయి. గంట‌న్న‌ర‌లో 20 ల‌క్ష‌లు.. మూడు గంట‌ల్లో 30 ల‌క్ష‌ల వ్యూస్ వ‌చ్చాయి. తెలుగు సినిమాల్లో ఇది కూడా ఓ రికార్డే.
అజ్ఞాత‌వాసి ఈ విష‌యంలో అంద‌రికంటే ముందున్నాడు. ఇది కేవ‌లం విడుద‌లైన అర‌గంట‌లోనే 10 ల‌క్ష‌ల వ్యూస్ అందుకుంది. ఆ త‌ర్వాత జై ల‌వ‌కుశ టీజ‌ర్ కు ద‌క్కింది ఆ రికార్డ్. ఇక ఇప్పుడు రంగ‌స్థ‌లం వాళ్ల‌నే ఫాలో అవుతున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. ఇన్నాళ్లూ ఈ చిత్రాన్ని సుకుమార్ ఎలా తెరకెక్కిస్తున్నాడో అనే చిన్న అనుమానం అయితే ఉండేది ఇప్పుడు టీజ‌ర్ చూసిన త‌ర్వాత సినిమా ఏ రేంజ్ లో ఉండ‌బోతుందో అర్థ‌మైపోతుంది. టీజ‌ర్ లో స‌మంత‌ను చూపించ‌లేదు. అంతేకాదు.. చ‌ర‌ణ్ త‌ప్ప టీజ‌ర్ లో మ‌రే పాత్ర‌ను ప‌రిచ‌యం చేయ‌లేదు సుకుమార్. త‌న కెరీర్ మొద‌లుపెట్టిన త‌ర్వాత ఫ‌స్ట్ టైమ్ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నాడు చ‌ర‌ణ్. చిట్టిబాబుగా అల‌రిస్తున్నాడు. చ‌ర‌ణ్ ఇలా ఉన్నాడంటే ఇక స‌మంత ఎలా ఉండ‌బోతుందో మ‌రి..? ఇప్ప‌టికే షూటింగ్ చివ‌రిద‌శ‌కు చేరుకున్న ఈ చిత్రం మార్చ్ 30న విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here