ఇన్నాళ్లూ ఈ మార్పేగా కోరింది బ‌న్నీ..!


అభిమానులు ఇప్పుడు అల్లుఅర్జున్ ను చూసి ఇదే మాట అంటున్నారు. ఇన్నాళ్లూ ఈయ‌న ఉన్న ప‌ద్ద‌తి వేరు.. ఇప్పుడు ఉన్న ప‌ద్ద‌తి వేరు. అల్లు అర్జున్ లో ఏదో తెలియ‌ని మార్పు బాగా గ‌ట్టిగా క‌నిపిస్తుంది. గ‌త రెండు మూడేళ్లుగా ఈయ‌న‌లో ఏదో తెలియ‌ని మార్పుతో పాటు పొగ‌రు కూడా క‌నిపించిందంటారు విశ్లేష‌కులు. అభిమానులు కూడా చీలిపోయారు.. ప‌వ‌న్ ఫ్యాన్స్ అని.. బ‌న్నీ ఫ్యాన్స్ అని దూర‌మైపోయారు.
ఆ క్ర‌మంలోనే ఈయ‌న మెగా కుటుంబానికి దూరంగా ఉంటున్నార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. ఇలాంటి టైమ్ లో రంగ‌స్థ‌లంతో రామ్ చ‌ర‌ణ్ బాక్సాఫీస్ బ‌ద్ద‌లైపోయే హిట్ ఇచ్చాడు.. ప‌వ‌న్ ఇమేజ్ ప‌రంగా బాగా పెరిగిపోయాడు.. మ‌రోవైపు చిరంజీవి కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.. స‌రిగ్గా ఈ స‌మ‌యంలో డిజే అనుకున్నంత‌గా ఆడ‌లేదు.
ఇవ‌న్నీ కూడి ఇప్పుడు మ‌ళ్లీ మెగా కుటుంబానికి చేరువ అవుతున్నాడు అల్లుఅర్జున్. తామంతా ఒక్క‌టే అని మ‌ళ్ళీ మ‌ళ్లీ చెబుతున్నాడు.
స‌రిగ్గా ఏడాది కింద ప‌వ‌న్ గురించి మాట్లాడ‌మంటే చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అంటూ కామెంట్ చేసి అభిమానుల కోపానికి గుర‌య్యాడు బ‌న్నీ. రెండు హిట్లు వ‌చ్చేస‌రికి బ‌న్నీ తానేదో మెగాస్టార్ లా ఫీల్ అవుతున్నాడంటూ మెగా ఫ్యాన్సే విమ‌ర్శించారు. అప్ప‌ట్లో ఈ విష‌యంపై చిరు కూడా పిలిచి బ‌న్నీకి క్లాస్ పీకాడ‌ని వార్త‌లు వినిపించాయి. ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే ఇప్పుడు బ‌న్నీలో చాలా మార్పు వ‌చ్చింది.
నా పేరు సూర్య ఆడియో వేడుక‌లోనే అది క‌నిపించింది.. ఇప్పుడు ప్రీ రిలీజ్ వేడుక‌లో మ‌రోసారి క‌నిపించింది. మొన్న ప‌వ‌న్ ను తెగ పొగిడేసాడు బ‌న్నీ. నెం.1 హీరో అయ్యుండి.. కోట్ల డ‌బ్బు వ‌దిలేసి.. విలాస‌వంత‌మైన జీవితాన్ని ప‌క్క‌న‌బెట్టి కేవ‌లం జ‌నం కోసం ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చాడ‌ని చెప్పాడు స్టైలిష్ స్టార్.
అలాంటి వ్య‌క్తిపై కావాల‌నే కొంద‌రు బుర‌ద జ‌ల్లుతున్నార‌ని.. ఎవ‌రెన్ని చేసినా ప‌వ‌న్ క‌చ్చితంగా స‌త్తా చూపిస్తార‌ని చెప్పాడు అల్లుఅర్జున్. ఆయ‌న మంచి వాడ‌ని.. ఆయ‌న క‌ష్టం, నిజాయితే బ‌ల‌మ‌ని చెప్పాడు ఈ హీరో.
ఇక ఇప్పుడు ప్రీ రిలీజ్ వేడుక‌లో చ‌ర‌ణ్ ను మోసాడు బ‌న్నీ.చ‌ర‌ణ్ త‌న‌కు త‌మ్ముడు అని.. రంగ‌స్థ‌లంతో ఇండ‌స్ట్రీని పైకి లేపాడ‌ని చెప్పాడు. ఇక అంత టితో ఆగ‌కుండా భ‌ర‌త్ అనే నేనుకు కూడా కంగ్రాట్స్ చెప్పాడు బ‌న్నీ. మ‌హేశ్ తో పాటు కొర‌టాల శివ‌కు మ‌న‌స్పూర్థిగా కంగ్రాట్స్ చెప్పాడు.
నా పేరు సూర్య‌తో ఈ స‌మ్మ‌ర్ లో హ్యాట్రిక్ పూర్త‌వుతుందని.. దాంతో పాటు ఆ త‌ర్వాత వ‌చ్చే మ‌హాన‌టి.. మెహ‌బూబా సినిమాల‌కు కూడా ఆల్ ది బెస్ట్ అని చెప్పి త‌న హూందాత‌నాన్ని నిరూపించుకున్నాడు అల్లు వార‌బ్బాయి. ఈయ‌న‌లో వ‌చ్చిన ఈ మార్పు చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు. ఇన్నాళ్లూ ఈ మార్పేగా నీలో మేం కోరుకుందంటూ మ‌న‌సులోనే సంతోష‌ప‌డుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here