ఇలియానా.. ఈ సోకులు అందుకేనా..?

ILEANA NEW PHOTOS
ఇదిగో ఇలాంటి ఫోటోలు చూసి చాలా కాలం అయిపోయింది క‌దా ఇలియానా నుంచి. అస‌లు తెలుగు ఇండ‌స్ట్రీని ప‌ట్టించుకుంటే క‌దా ఈ భామ‌ను మ‌నోళ్లైనా ప‌ట్టించుకోడానికి.. గుర్తించుకోడానికి. అప్పుడెప్పుడో ఆరేళ్ల కింద తెగదెంపులు చేసుకుని వెళ్లిపోయింది బాలీవుడ్ కు. అక్క‌డే కాపురం పెట్టేసింది. కానీ ఇప్పుడు అక్క‌డ అవ‌కాశాలు రావ‌ట్లేదు. విజ‌యాలున్నా ప‌ట్టించుకునేవాడు లేడు.
దాంతో ఇప్పుడు మ‌ళ్లీ మెల్ల‌గా చూపు తెలుగు ఇండ‌స్ట్రీ వైపు మ‌ళ్లించింది. అందుకే త‌న‌కంటే ముందు త‌న ఫోటోల‌ను రాయ‌బారానికి పంపింది ఇలియ‌నా. ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్న ఇల్లీబేబికి శీను వైట్ల నుంచి పిలుపు అందింది. ఈయన ద‌ర్శ‌క‌త్వంలో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమా చేస్తున్నాడు. ఇందులో అను ఎమ్మాన్యువ‌ల్ త‌ప్పుకోవ‌డం గోవాబ్యూటీకి క‌లిసొచ్చింది. గ‌తంలో ర‌వితేజ‌తో క‌లిసి కిక్.. ఖ‌త‌ర్నాక్.. దేవుడు చేసిన మ‌నుషులు సినిమాల్లో న‌టించింది ఇలియానా. ఇన్నాళ్లూ ఇలియానా ఎక్క‌డుందో కూడా తెలియ‌దు.
కానీ ఇప్పుడు స‌డ‌న్ గా ఈమె ఫోటోల‌న్నీ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇదంతా ఆమె ప్రీ ప్లాన్ గా క‌నిపిస్తుంది. ముందు నా ఫోటోలు చూడండి.. న‌న్ను గుర్తు పెట్టుకోండి.. అప్పుడు నేనొస్తా అన్న‌ట్లుంది ఇలియానా వాల‌కం. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. జ‌ఘ‌న సుంద‌రి సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here