ఈ క‌ణంను ప‌ల్ల‌వి ప‌ట్టించుకుంటుందా..?

ఆడ‌వాళ్ల కోపం చాలా దారుణం. వాళ్లు ఒక్క‌సారి కోప్ప‌డితే అస్స‌లు చాలా కాలం ఉంటుందంటారు. అందులోనూ సాయిప‌ల్ల‌వి లాంటి హీరోయిన్ ల విష‌యంలో అది మ‌రీ ఎక్కువ‌గా ఉంటుందేమో..? ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వ‌చ్చింది అంటే క‌ణం సినిమా విష‌యంలో సాయిప‌ల్ల‌విపై నాగ‌శౌర్య కొన్ని క‌మెంట్స్ చేసాడు. షూటింగ్ టైమ్ లో యూనిట్ కు చుక్కలు చూపించింద‌ని చెప్పాడు శౌర్య‌. ఈ విష‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కు సాయిప‌ల్ల‌వి కూడా స్పందించ‌లేదు. ఇప్పుడు క‌ణం సినిమా విడుద‌ల టైమ్ ద‌గ్గ‌ర ప‌డుతుంది. మార్చ్ లో సినిమా విడుద‌ల కానుంది. ఈ మ‌ధ్యే సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది ఈ చిత్రం. యు బై ఏ స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. ఏఎల్ విజ‌య్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఎన్నాళ్ల నుంచో తీర‌ని స‌మ‌స్య‌గా ఉన్న బ్రూణ హ‌త్య‌ల నేప‌థ్యంలో ఈ క‌థ తెర‌కెక్కింది. ట్రైల‌ర్ చూస్తుంటేనే సినిమాపై అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. పైగా సాయిప‌ల్ల‌వి న‌ట‌న సినిమాకు మ‌రో హైలైట్ కానుంది.
ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు క‌ణం సినిమాను తెలుగులో ప్ర‌మోట్ చేయ‌డానికి సాయిప‌ల్ల‌వి వ‌స్తుందా రాదా అనేది మ‌రో ఎత్తు. ఎందుకంటే త‌న జీవితంలో ఎవ‌రైనా హీరోయిన్ తో ప‌ని చేయ‌కూడ‌దు అనుకుంటే అది సాయిప‌ల్ల‌వి అని చెప్పాడు నాగ‌శౌర్య‌. త‌న‌ను బాగా ఇబ్బంది పెట్టిన హీరోయిన్ సాయిప‌ల్ల‌వి అంటూ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు శౌర్య‌. ఇలాంటి టైమ్ లో ఈయ‌న‌తో క‌లిసి తెలుగులో క‌ణం సినిమాను సాయిప‌ల్ల‌వి ప్ర‌మోట్ చేస్తుందా అనేది అనుమాన‌మే. ఎందుకంటే ఎంసిఏ సినిమానే ప‌ట్టించుకోలేదు సాయిప‌ల్ల‌వి. త‌న పాత్ర‌ను క‌ట్ చేసినందుకు హ‌ర్ట్ అయింది అని కొంద‌రు.. లేదు నానితో గొడ‌వైంద‌ని ప్ర‌మోష‌న్స్ కు రాలేద‌ని మ‌రికొంద‌రు చెప్పారు. కార‌ణం ఏదైనా సాయిప‌ల్ల‌వి ఇగో హ‌ర్ట్ అయింద‌క్క‌డ‌. అందుకే నానిని కూడా ప‌ట్టించుకోలేదు.. ఇక ఇప్పుడు క‌ణం సినిమాకు నాగ‌శౌర్య కావాల్సినంత హ‌ర్ట్ చేసాడు ఈ భామ‌ను. మ‌రి ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో శౌర్య‌తో కలిసి సాయిప‌ల్ల‌వి ప్ర‌మోట్ చేస్తుందో లేదో చూడాలిక‌..? ఒక‌వేళ చేస్తే క‌లిసి ఎలా ఉంటారో మ‌రి..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here