ఈ గ్యాంగ్ లీడ‌ర్ కు భ‌యం లేదేంటి..? 

SURIYA - UV Creations Studio - Green GANG first look
మ‌న‌కు గ్యాంగ్ లీడ‌ర్ అంటే చిరంజీవే.. ఇంకో పేరు గుర్తు రాదు. కానీ ఇప్పుడు గ్యాంగ్ లీడ‌ర్ అంటే తానే అంటున్నాడు సూర్య‌. ఈయ‌నిప్పుడు తాన సేరంద కూట్టం సినిమాలో న‌టిస్తున్నాడు. హిందీలో హిట్టైన స్పెష‌ల్ 26 సినిమాకు రీమేక్ ఇది. ఇదే చిత్రాన్ని తెలుగులో గ్యాంగ్ పేరుతో విడుద‌ల చేస్తున్నారు. కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ఈ చిత్రం జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  సంక్రాంతికి తమిళ‌నాట వ‌స్తే స‌మ‌స్య లేదు కానీ తెలుగులో మాత్రం ఇప్ప‌టికే ప‌వ‌న్, బాల‌య్య లాంటి హీరోలంతా రెడీగా ఉన్నారు. వీళ్ల‌ను త‌ట్టుకుని సూర్య గ్యాంగ్ నిల‌బ‌డుతుందా..? ఇప్ప‌టికీ వెన‌క‌డుగు మాత్రం వేయ‌ట్లేదు సూర్య‌. మ‌రోసారి కూడా త‌న విడుద‌ల తేదీ క‌న్ఫ‌ర్మ్ చేసాడు ఈ హీరో. జ‌న‌వ‌రి 12న తాను రావ‌డం ఖాయ‌మ‌ని పోస్ట‌ర్ విడుద‌ల చేసాడు. ఆ రోజే బాల‌కృష్ణ జై సింహా కూడా విడుదల కానుంది. అయినా కానీ వెన‌క్కి త‌గ్గేదే లేదంటున్నాడు ఈ గ్యాంగ్ లీడ‌ర్.
అస‌లే ఈ మ‌ధ్య కాలంలో సూర్య‌కు విజ‌యాలే లేవు. ఏడేళ్లుగా సింగం, సింగం 2 మాత్ర‌మే హిట్ అయ్యాయి. 24 లాంటి సినిమాలు ప్ర‌శంస‌లు అందుకున్నాయి కానీ విజ‌యం సాధించ‌లేదు. ఈ మ‌ధ్య ప్ర‌తీ సినిమాలో చూసినా నీట్ గా గ‌డ్డం చేసుకుని.. క్లాస్ లుక్ తోనే క‌నిపిస్తున్న సూర్య‌.. తాన సెరేంద కూట్టం కోసం కెరీర్ మొద‌ట్లో క‌నిపించిన లుక్ లోకి మారిపోయాడు. ఈ మ‌ధ్యే వ‌చ్చిన టీజ‌ర్ చూస్తుంటే ఆస‌క్తి పెరిగిపోతుంది. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్. నానుం రౌడీధాన్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత విఘ్నేష్ తెర‌కెక్కిస్తున్న సినిమా ఇది. పైగా ఇప్పుడు సూర్య‌కు విజ‌యం చాలా కీల‌కం. సింగం త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన స‌క్సెస్ లేక తంటాలు ప‌డుతున్నాడు సూర్య‌. సింగం 3 కూడా సూర్య ఆశ‌లు నిల‌బెట్ట‌లేదు. తాన సెరేంద కూట్టంలో ప‌క్కా పంచెక‌ట్టుతో ర‌ప్ఫాడిస్తున్నాడు సూర్య‌. మ‌రి చూడాలిక‌.. ఈ లుక్.. సూర్య‌కు విజ‌యాన్ని తీసుకొస్తుందో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here