ఊర‌మాస్ గా వ‌చ్చేస్తున్న కార్తి..

CHINABABU TEASER REVIEW
కార్తి సినిమాల‌కు త‌మిళ్ తో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంటుంది. మార్కెట్ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు అన్న‌య్య సూర్య కంటే కార్తి సినిమాల‌కే ఇక్క‌డ డిమాండ్ పెరిగిపోయింది. పైగా కాష్మోరా.. ఖాకీ లాంటి సినిమాలు తెలుగులోనూ మంచి వ‌సూళ్లు సాధించాయి. ఇదే జోరు కొన సాగించ‌డానికి ఇప్పుడు వ‌చ్చేస్తున్నాడు కార్తి. తాజాగా ఈయ‌న న‌టిస్తున్న క‌డైకుట్టి సినిమాను తెలుగులో చిన్న‌బాబుగా అనువ‌దిస్తున్నారు.
ఈ చిత్రాన్ని కార్తి అన్న‌య్య సూర్య నిర్మిస్తుండ‌టం విశేషం. పాండిరాజ్ ద‌ర్శ‌కుడు. తెలుగులో జ‌య జాన‌కి నాయ‌కాను అందించిన మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి విడుద‌ల చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది. ఇది చూస్తుంటే ప‌క్కా మాస్ సినిమా అని అర్థ‌మైపోతుంది. రైతుల క‌థ‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. పుట్టించేవాడు దేవుడు అయితే..
పండించే వాడు కూడా దేవుడే.. రైతు అయితే కాల‌ర్ ఎగ‌రేయ్ అంతే అంటూ కార్తి చెప్పిన డైలాగ్స్ ఇప్పుడు బాగానే పాపుల‌ర్ అవుతున్నాయి. కాక‌పోతే సినిమాలో త‌మిళ వాస‌న‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. అఖిల్ ఫేమ్ సయేషా సైగ‌ల్ ఈ చిత్రంలో హీరోయిన్. మొత్తానికి చూడాలిక‌.. చినబాబుతో కార్తి ఎలాంటి మాయ చేస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here