ఎంత స‌క్క‌గా మాట్లాడావ్ చ‌ర‌ణ్..


అవును.. నా పేరు సూర్య ప్రీ రిలీజ్ వేడుక‌లో చ‌ర‌ణ్ మాట్లాడిన తీరు చూసి అభిమానులు కూడా ఇదే అనుకున్నారు. ఫ్యాన్సే కాదు.. ప్రేక్ష‌కులు కూడా మెగా వార‌సుడి మాట‌ల‌కు మురిసిపోయారు. ఎంత స‌క్క‌గా మాట్లాడావో చ‌ర‌ణ్ అంటున్నారు. తాము ప‌డుతున్న క‌ష్టాన్ని అంద‌రికీ అర్థం అయ్యేలా చెప్పాడు చ‌ర‌ణ్. ప్ర‌పంచంలో క‌రెప్ష‌న్ అంటూ లేని ఇండ‌స్ట్రీ ఏదైనా ఉందంటే అది కేవ‌లం సినిమా ఇండ‌స్ట్రీ మాత్ర‌మే అన్నాడు చ‌ర‌ణ్.
దీనికి కార‌ణాలు కూడా చెప్పాడు ఈ హీరో. మాకేం ఉంట‌ది మీరే చెప్పండి.. పొద్దున్నే లేచి జిమ్ చేస్తాం.. ఆ త‌ర్వాత షూటింగ్ కు వెళ్తాం.. ఎండా వానా అని తేడా లేకుండా క‌ష్ట‌ప‌డ‌తాం.. కుటుంబంతో గంట‌సేపు అలా గ‌డిపి ప‌డుకుంటాం.. మ‌ళ్లీ పొద్దున్నే లేచి ప‌రుగులు పెడ‌దాం.. ఇక్క‌డ క‌రెప్ష‌న్ కు చోటు ఎక్క‌డుంది మీరే చెప్పండి అంటూ ప్రేక్ష‌కుల్నే అడిగాడు చ‌ర‌ణ్. మీకు ఒక‌రు చెప్పాల్సిన ప‌నిలేదు.. మీరే తెలివైన వాళ్లు..
ఎవ‌రేం చూపించినా ఇండ‌స్ట్రీలో ఏం జ‌రుగుతుంద‌నేది మీకు బాగా తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు చ‌ర‌ణ్. మీడియా ఇష్ట‌మొచ్చిన‌ట్లు రాస్తుంటే మీరు త‌ప్పుగా అర్థం చేసుకోవ‌ద్ద‌ని కోరాడు చ‌ర‌ణ్. మీడియాను కూడా మీరు బ‌త‌కండి.. మ‌మ్మ‌ల్ని కూడా ప్ర‌శాంతంగా బ‌త‌క‌నీయండి అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చ‌ర‌ణ్. ఈయ‌న మాట‌ల్లో నిజం కూడా లేక‌పోలేదు. అయితే క‌రెప్ష‌న్ జ‌రిగే చోట జ‌రుగుతూనే ఉంటుంది.. దానికి ఇండ‌స్ట్రీల‌తో ప‌నిలేదు. మొత్తానికి తాను అనుకున్నది అనుకున్న‌ట్లుగా చాలా బాగా మాట్లాడాడు మెగా వార‌సుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here